మాస్కు లేకుంటే జరిమానా
పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ టౌన్, డిసెంబర్ 6 : మాస్కు లేని వారికి విధి గా వెయ్యి జరిమానా విధించాలని మక్తల్ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈనెల 17న నిర్వహించనున్న పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త భీమాచారి, ఈవో సత్యనారాయణ, వైద్య, విద్యుత్, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌తో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భ క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులంద రూ సమన్వయంతో పనులు చేయాలని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలని, బందోబస్తు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఆ రోగ్యపరమైన ప్రథమ చికిత్స, ఎమర్జెన్సీ అందుబాటులో ఉండే విధంగా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై రాములు, మున్సిపల్ కమిషనర్ రా జయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రె డ్డి, అధికారులు తదితరు లు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు వేసుకోవాలి
యాసంగిలో వరికి బ దులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్, మండల వ్యవసాయాధికారితో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాధికారులు రైతులకు వరికి బదులుగా ఇతర పంటల ప్రాధాన్యతలను వివరించి ఆదాయం వచ్చే విధంగా పం టలను వేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. త క్కువ పెట్టుబడి అధిక దిగుబడి వచ్చే పంటలు వేసే విధం గా సలహాలు ఇవ్వాలన్నారు. ఆరుతడి పంటల సాగుతో నేల సారవంతమవుతుందని ఆయన తెలిపారు
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేం ద్రం చెబుతున్నందున ప్రకటనలను రైతులకు వివరించాలన్నా రు. ఇతర పంటలను సాగు చేసుకోవాలన్నారు. అనంత రం యాజమాన్య పద్ధతుల పుస్తకాన్ని ఎమ్మెల్యే వ్యవసాయాధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఏడీఏ దైవగ్లోరి, మక్తల్ మండల వ్యవసాయాధికారి మిథున్ చక్రవర్తి, ఊట్కూర్ మండల వ్యవసాయాధికారి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.