మక్తల్ : మండలంలో ఇసుక టిప్పర్ల ( Sand Tippers ) అతివేగం ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. జాతీయ రహదారిపై( National Highway) ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో శుక్రవారం వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంతన్ గౌడ్ గ్రామానికి చెందిన గోసాయి అంజప్ప (47)ను ఇసుక టిప్పర్ ఢీ కొనగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
సిలిండర్ స్టవ్‌లు మరమ్మతులు చేసుకునే అంజప్ప శుక్రవారం ద్విచక్రవాహనంపై మరో గ్రామానికి వెళ్తుండగా మక్తల్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో అంజప్ప అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడని గ్రామస్థులు తెలిపారు.
అధికార పార్టీకి చెందిన ఇసుక కాంట్రాక్టర్లు తమకిష్టం వచ్చిన రీతిలో ఇసుక రీచ్‌లో నడపడంతో పాటు, అనుమతులు లేకున్నప్పటికీ రాత్రి సమయంలో వందలాది టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఇదిలా ఉండగా శుక్రవారం మరొక టిప్పర్ మక్తల్ మండలం జక్లేర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బ తింది.
Also Read |
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. తల్లీ కూతురు దుర్మరణం