మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 23 : బహుజన వీరుడు, పాలమూరు రాబిన్‌హుడ్ పండుగ సాయన్న మహరాజ్ అని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతి గ్రీన్ బెల్ట్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సాయన్న పేదరికంతో అలమటిస్తున్న ప్రజల కోసం పోరాడి బడుగు వర్గాలందరికీ అన్నం పెట్టిన మహానుభావుడన్నా రు. అలాంటి వ్యక్తిని పూజించడం మన అదృష్టంగా భావించాలని మంత్రి పేర్కొన్నారు. సాయన్న వారసులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. త్వరలోనే రూ.3కోట్లతో ముదిరాజ్ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం శాసన మండలి ఉపాధ్యక్షు డు బండ ప్రకాశ్ మాట్లాడుతూ పండుగ సాయన్న నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు అండగా నిలిచారన్నారు.
సాయిచంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..
పాలమూరు, జూలై 23 : తెలంగాణ.. సాయిచంద్ లాంటి గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఇది ఎంతో బాధాకరమైన ఘటన అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సాయిచంద్ భార్యకు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చి వారి కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు. సాయి జ్ఞాపకార్థం జిల్లాకేంద్రంలో ఆయ న విగ్రహం ఏర్పాటుతోపాటు కళాకారుల కోసం సాయిచంద్ భవన్ నిర్మిస్తామని, అర్హులైన కళాకారులకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా గాయకుడు దివంగత సాయిచంద్ సంస్మరణ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్తో కలిసి సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాయిచంద్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని, యావత్ తెలంగాణ ఆయనను ఎప్పటికీ మర్చిపోలేదన్నారు.
ట్యాంక్‌బండ్ పరిశీలన
మహబూబ్‌నగర్ టౌన్, జూలై 23 : పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్‌బండ్, కేబుల్‌బ్రిడ్జి, శిల్పారా మం, ఐలాండ్ పనులను ఆదివారం క్రీడలు, యువజన, సర్వీసుల శాఖల మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్తో కలి సి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరా జ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, ముదిరాజుల సంఘం అధ్యక్షుడు కిశోర్, పండుగ సాయన్న వారసుడు నర్సింహులు, ఆశన్న, సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంకర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎదిర నర్సింహులు, హన్వాడ ఎంపీపీ బాలరాజు, కౌన్సిలర్ కిశోర్, వివిధ కుల సంఘాల గౌరవాధ్యక్షుడు రవిశంకర్, కవి వన్నాడ అంజన్న, జంబులయ్య, కిరణ్, ఎర్ర నర్సింహ, ఎర్ర బాలయ్య, మునిమోక్షం కేశవులు పాల్గొన్నారు.