మదనాపురం, అక్టోబర్ 14 : ప్రభుత్వ దవాఖానల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్ తెలిపారు. కమాలోద్దీన్‌పూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సౌజన్యలతకు సోమవారం కొత్తకోట పీహెచ్సీలో సాధారణ ప్రసవం చేశారు. విష యం తెలుసుకున్న డీఎంహెచ్‌వో కొత్తకోట పీహెచ్‌సీకి చేరుకొని సౌజన్యలతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జయచంద్రమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో సురక్షితమైన కాన్పులు జరుగుతాయని.. కానీ, అనవసరంగా ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి డబ్బులతోపాటు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారన్నారు. ప్రైవేట్‌లో అవసరం లేకున్నా సిజేరియన్ చేసి డబ్బులు దండుకుంటున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అనుభవజ్ఞులైన సి బ్బంది ఉండడంతో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇ స్తారన్నారు. డాక్టర్ సౌజన్యలత రోల్‌మోడల్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది ఉన్నారు.