అచ్చంపేట, జనవరి 13 : నల్లమల అటవీ ప్రాంతం మరో టూరిజం హబ్‌గా ఏర్పాటు కాబోతుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఎఫ్‌వో రోహిత్ గోపిడి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద నల్లమలలోని అక్కమహాదేవి గుహలకు వెళ్లడానికి సఫారీ యాత్రను సోమవారం వారు ప్రారంభించారు.
అనంతరం అక్కడి నుంచి అటవీశాఖ బోట్లో కృష్ణానది గుండా అక్కమహాదేవీ గుహలకు చేరుకొని గుహలను పరిశీలించారు. అనంతరం వారు మా ట్లాడుతూ టూరిజం, అటవీ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా నల్లమల ప్రాంతంలో చారిత్రాత్మకమైన 18 స్థలాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అక్కమహాదేవి గుహలను సందర్శించేందుకు సఫారీ యా త్ర కోసం సందర్శకులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ, టూరి జం శాఖాధికారులు పాల్గొన్నారు.