వనపర్తి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షను భగ్నం చేయాలని, తద్వారా ఉ ద్యమాన్ని నీరుగార్చాలని చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ అమరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింగిరెడ్డి గృహంలో కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడు తూ శ్రీకాంతాచారి మరణంతో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిలోకాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిందన్నారు. సూర్యచంద్రులు న్నంత వరకు శ్రీకాంతాచారి పేరు చరిత్రలో నిలిచి ఉంటుందని, తెలంగాణ ఉద్యమజ్వాలగా నిలిచిన ఈ త్యాగం ఎప్పటికీ తెలంగాణ సమాజం మరవదన్నారు. శ్రీకాంతాచారి చూపిన త్యాగం, తెగువలు తెలంగాణ యువతకు మార్గదర్శకం అని, ఉద్యమకారుల త్యాగమే తెలంగాణకు పునాదిగా నిలిచిందని ఆయన వివరించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్, విజయ్‌కుమా ర్, నందిమళ్ల అశోక్, మాణిక్యం, ఆ వుల రమేశ్, నాగన్నయాదవ్, కంచ రవి, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, రహీం, ఇమ్రాన్, హుస్సేన్, రాము, మునికుమార్, వెంకటేశ్వరమ్మ, న్యాయవాదు లు వెంకట్రామిరెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి నివాళి
జడ్చర్లటౌన్, డిసెంబర్ 3 : తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన వీరుడు శ్రీకాంతాచారి అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో శ్రీకాంతాచారి చేసిన త్యాగం చిరకాలం నిలిచిపోతుందన్నారు. శ్రీకాంతాచారి చూపిన త్యాగం, పోరాటం, ధైర్యం ఎప్పటికీ మార్గదర్శకం అని ఆయన్ను శ్రీకాంతాచారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు పిట్టల మురళి, శ్రీకాంత్, వీరేశ్, కాలేబ్, కరాటే శ్రీను, కావలి నర్సింహులు, పెద్ది వెంకటేశ్, అలీం, కౌన్సిలర్లు బుక్క మహేశ్, ఉమాశంకర్‌గౌడ్, లత తదితరులు పాల్గొన్నారు.