ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు పి.రాములు. గ్రామం దొడగుంటపల్లి, పె ద్దమందడి మండలం. ఇతనికి పెద్దమందడి కోఆపరేటివ్ బ్యాంకులో రూ.ల క్షా15వేల అప్పు ఉంది. 2019లో రూ.లక్షా 95 వేలు రుణం తీసుకుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మాఫీపోనూ మిగిలిన బాకి రూ.లక్షా 15వే లుగా బ్యాంకువారు స్టేట్మెంట్ ఇచ్చా రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల వరకు చేసిన రుణమాఫీలో రాములు పే రు రావాలి. కానీ, ఎవరు చేసిన తప్పిద మో.. రుణమాఫీ కాలేదు. దీనిపై 6 నె లల్లో ఐదు దఫాలు కలెక్టరేట్‌కు తిరుగుతూ వినితి పత్రాలు ఇస్తూనే ఉన్నాడు.
చివరకు ప్రజావాణిలో దరఖాస్తు తీసుకొని రశీదు కూడా ఇవ్వలేదని చెబుతున్నాడు. ఇటీవల వనపర్తికి డిప్యూటీ సీ ఎం మల్లు భట్టి విక్రమార్క వచ్చినప్పు డు ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ వి ష్ణువర్ధన్రెడ్డిలున్నప్పుడు ఎమ్మెల్యేకు వి నతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే విష్ణువర్ధన్ రె డ్డి తీసుకుని నేను చూస్తాలే అని పంపించాడు.
ఇక 24 ఫిబ్రవరి 2025న ప్రజావాణిలో మళ్లీ దరఖాస్తు ఇవ్వగా.. రశీదు ఇచ్చి మూడురోజుల తర్వాత కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 201లో వ్యవసా య కార్యాలయం ఉంటుంది..అక్కడికెళ్లి ఈ రశీదు చూయించమని చెప్పి పం పారు. తీరా శనివారం జిల్లా వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి రాములు రశీదు చూయించగా ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది.. మీ ఇంటికి సమాచారం వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్పి పం పారు. ఇలా జిల్లాలో ఒక్క దొడగుంటపల్లి రాములు కాదు. వేలాది మంది రై తులు అర్హత ఉండి రుణమాఫీ అవ్వక నానా యాతన పడుతున్నారు. సీఎం రా క ద్వారానైనా ఇలాంటి అన్నదాతల క ష్టాలు గట్టెక్కుతే బాగుండని రైతులు భావిస్తున్నారు.