రైతులు కదంతొక్కారు.. గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు.. నియోజకవర్గ, మండల కేంద్రాలు ధర్నాలతో దద్దరిల్లాయి.. రు ణమాఫీలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వగా.. గురువారం ఉమ్మడి జి ల్లాలో రైతులతో కలిసి నాయకులు కదంతొక్కారు. చౌరస్తాలు, రోడ్లపైకి చేరుకొని సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. పలు చోట్ల రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ త ల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
వనపర్తి, మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అలంపూర్‌లో ఎమ్మెల్యే విజయుడు, దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేటలో రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో చిట్టెం, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తిలో జైపాల్‌యాదవ్, వంగూరులో గువ్వల బాలరాజు, జడ్చర్లలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్, గద్వాలలో బీఆర్ఎస్ ముఖ్య నా యకులు పాల్గొన్నారు. షరతుల్లేకుండా అర్హులైన ప్రతి రైతుకూ రుణమా ఫీ చేయాలని డిమాండ్ చేశారు. నాడు పంట రుణాలు తెచ్చుకోండి.. మాఫీ చేస్తామని ప్రకటనలు గుప్పించి..
నేడు అధికారంలోకి వచ్చాక కొర్రీలు ఎందుకు పె డుతున్నారని ప్రశ్నించారు. 9 నెలల్లోనే రైతులను రోడ్డెక్కించారని ఆగ్రహం వ్యక్తం చే శారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి భంగపాటు తప్పదని హెచ్చరించారు. మా ఫీపై ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ మంత్రులు చెప్పే మాటల లెక్కలకు ఎలాంటి పొంతన లేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలుంటే.. కొద్ది మందికి మాత్రమే చేసి గారడీ చేసిందన్నారు. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా అర్హులందరికీ ఆంక్షలు లేకుండా మాఫీ చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, ఆగస్టు 22
ఎలక్షన్లప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామం టూ కాంగ్రెసోళ్లు గొప్పలు చెప్పిండ్రు. అవి నమ్మి ఓటేసినం. ఓటేసిన పాపానికి కష్టాలు ప డుతున్నాం. రుణమాఫీ చేసినమని గొప్పలు చెబుతున్నరు. రూ.2లక్షలలోపే రుణం తీసుకున్నా. అయినా మూడుసార్లు సారోళ్లు చెప్పిన లిస్టుల నా పేరు రాలేదన్నరు. ఎందుకు రాలేదని బ్యాంకోళ్లను అడిగితే అగ్రికల్చరోళ్లను అడగమంటరు. వాళ్లనడిగితే బ్యాంకోళ్లను అడగమని ముప్పతిప్పలు పెడ్తున్నరు. నేను రైతుననే రుణం ఇచ్చిండ్రు. ఇప్పుడు మాఫీ చే యనీకే ఎందుకు కిరికిరి పెడుతున్నరు. రేవంత్‌రెడ్డి బోగస్ మాటలు చెప్పి కాయకష్టం చేసే రైతులను మోసం చేస్తున్నడు. ఈ గవర్నమెం ట్ ఇంకా నాలుగేండ్లు ఇలాగే పాలన చేస్తే ప్ర జలంతా పరేషాన్ కావాల్సిందే. రైతులు నట్టేట మునగాల్సిందే.
– రాజమ్మ, మహిళా రైతు, మక్తల్