నారాయణపేట, అక్టోబర్ 7 : పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018 మే 10వ తేదీన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 2018-19లో ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు విడుతల్లో ఏటా రూ.8 వేలను అందించింది. 2019-20 నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచి.. ఏటా రూ.10 వేలను రైతుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది.
వానకాలం పెట్టుబడిని ఏప్రిల్ నుంచి.., యాసంగి సాయాన్ని నవంబర్ నుంచి పంపిణీ చేసేవారు. పథకం ప్రారంభం నుంచి 2023 యాసంగి వరకు 12 విడుతల్లో నారాయణపేట జిల్లాకు రూ.2,404.86 కోట్ల సాయాన్ని అందించారు. ఇందులో 11 సార్లు బీఆర్ఎస్ సర్కారు అందించగా.. 12వ సారి పెట్టుబడి వేసేందుకు సిద్ధం చేయగా ఎన్నికల కోడ్ దృష్ట్యా నిలిచిపోయింది. ఆ తర్వాత 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉన్న రైతుబంధు డబ్బులను ఖాతాల్లో జమ చేసింది.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు పథకాన్ని రైతుభరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. పెట్టుబడి సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచి ఇస్తామని చెప్పినా.. కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే గత విడుతలో ఎకరాకు రూ.5వేల చొప్పున అందించింది. అయితే, పథకం పేరు మార్చినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. కేసీఆర్ పాలనలో ఠంచన్‌గా డబ్బులు అందగా.. నేడు ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లున్నది. ఈ ఏడాది వానకాలం సాగు సమయం ముగిసినప్పటికీ ఇంతవరకు డబ్బులు జమకాకపోవడం శోచనీయం.
రైతుబంధు పథకం ప్రారంభమైన తొలి విడుతలో (2018) వానకాలం సీజన్‌కు నారాయణపేట జిల్లాలో 1,26,592 మంది రైతులకు గానూ రూ.159.94 కోట్లు.., 2018 యాసంగిలో 1,20, 553 మందికి రూ.157.27 కోట్లు పంపిణీ చేశారు. 2019 వానకాలంలో 1,27,920 మందికి రూ. 180.73 కోట్లు, యాసంగి సీజన్లో 1,02,895 మందికి రూ.127.28 కోట్లు.., 2020 వానకాలంలో 1,44,671 మందికి రూ.219.22 కోట్లు.., యాసంగి సీజన్లో 1,47,829 మందికి రూ. 221.12 కోట్లు.., 2021 వానకాలంలో 1,54, 678 మందికి రూ.222.69 కోట్లు, యాసంగిలో 1,59,846 మంది ఖాతాల్లో రూ.222.96 కోట్లు జమచేశారు. 2022 వానకాలంలో 1, 65,873 మందికి రూ.224.18 కోట్లు, యాసంగి లో 1,63,257 మందికి రూ.219.81 కోట్లు.., 2023 వానకాలం లో 1,74,687 మందికి రూ. 225.24 కోట్లు, యాసంగిలో 1,76,747 మంది రైతులకుగానూ రూ.224.42 కోట్లు పంపిణీ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పంట సాగు ప్రారంభానికి ముందే రైతుబంధు డబ్బులిచ్చేవారు. మాకు ఎలాంటి ఇబ్బందుల్లేకుం డా కేసీఆర్ సర్కారు ఆదుకున్న ది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం సీజన్ ముగియడానికి వచ్చినా ఇంతవరకు రైతుభరోసా డబ్బులు జమచేయలేదు. రైతులపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు మిత్తీలు కూడా కట్టే పరిస్థితుల్లో లేము. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.15 వేలు ఇస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి.. ఎకరాకు 15 పైసలు కూడా ఇవ్వలేదు. రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మా రింది. రుణమాఫీ పూర్తిగా చేయలేక చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డికి రానున్న రోజుల్లో తగిన గుణపా ఠం చెబుతాం. – నగేశ్‌గౌడ్, రైతు, పసుపుల,
మరికల్ మండలం, నారాయణపేట జిల్లా
ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఆ పైసలతో సంబురంగా సాగు చేద్దామని అనుకున్నా. కానీ, డబ్బులు ఇవ్వకపోవడం తో బయటి వ్యక్తులతో అప్పు తె చ్చాను. ప్రకృతి కన్నెర చేయడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో మిత్తీలు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరిట సకాలంలో డబ్బులు జమయ్యేవి. నేడు పంట ముగిసే సమయానికి పైసలు రాలేదు. దసరా నాటికి రైతుభరోసా ఇస్తామని చెప్పినా.. ఆ ప్రభు త్వం మీద నమ్మకం లేకుండా పోయింది. ప్రస్తుతం నేను నాలుగెకరాల్లో వరి సాగు చేశాను. గత నెలలో కురిసిన వర్షాలతో పంట దెబ్బతిన్నది. ఇ ప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసాతోపాటు పంట లు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఆ దుకొంటే బాగుంటుంది.
– యాదయ్య, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పం టలకు కలిపి రూ.10 వేలను సాగు సమయంలో ఖాతాల్లో జమచేసేది. దీంతో దళారుల వద్ద అప్పు తెచ్చే బాధ తప్పేది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం సాగు ముగియడానికి వచ్చినా ఇప్పటి వరకు రూపాయి కూడా జమకాలేదు. దీంతో చాలా ఇబ్బందులు ప డుతున్నాం. అప్పులు తెచ్చి సాగు చేపట్టామని న ష్టం రావడంతో మిత్తీలు కూడా కట్టే పరిస్థితి లేకుండాపోయింది. ప్రస్తుత ప్రభుత్వం రైతన్నలపై చిన్నచూపు చూస్తున్నది.
– వడ్డె అంజప్ప, రైతు, నేరేడుగం, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా