సంక్రాంతికి ముందే రైతుబంధు సంబురమొచ్చింది. ఈ యాసంగి సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేస్తున్నది. 2018లో ప్రారంభమైన ఈ పథకం.. పదో విడుత సాయాన్ని బుధవారం నుంచి ప్రారంభించింది. రూ.5 వేల చొప్పున తొలి రోజు 3,23,295 మంది రైతుల ఖాతాల్లో రూ. 117,19,69,424 కోట్లు జమయ్యాయి. ముందుగా ఎకరాలోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుండగా.. ఆయా రైతుల మొబైల్‌కు టింగ్.. టింగ్.. అని మెసేజ్‌లు వచ్చాయి. మొత్తం 10 లక్షల మందికి లబ్ధి చేకూరనుండగా.. రూ.12 వేల కోట్ల మేర సాయం అందనున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలో రూ.377 కోట్లు అత్యధికంగా జమకానున్నాయి. దీంతో కర్షకుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. యాసంగి పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు యాసంగిలో సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడిసాయం నేరు గా జమచేస్తున్నది. ఎకరాకు రూ.5వేల చొప్పు న అందజేస్తున్న రైతుబంధు మొదటిరోజు 3, 23,295మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా మ ళ్లించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా రూ.117, 19,69,424కోట్ల సాయం అందింది. విడుత ల వారీగా మిగతా రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది. ఉదయం నుంచే రైతుల సెల్ఫోన్లకు టింగ్ టింగ్‌మంటూ మేసేజ్‌లు వస్తుండడంతో ఆనందంలో మునిగిపోయారు.
యాసంగికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అందించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎకరా నుంచి ఐదెకరాలలో పు రైతులకు పెట్టుబడిసాయం అందించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ధరణి వచ్చాక కొంతమంది రైతుల భూముల్లో వ్యత్యాసం వచ్చింది. మరికొందరి భూమి పార్ట్‌బీలో ఉండడంతో ఇన్నాళ్లూ పెట్టుబడిసాయం అందలేదు. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీంతో మరికొంత మందికి పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్‌యోజన పథకం అభాసుపాలవుతున్న ది. అనేక నిబంధనలు పెట్టి రైతులకు సాయం అందకుండా ఆపేస్తున్నారు. గతంలో వచ్చిన వాళ్లకు కేవైసీ నిబంధనపెట్టి.. అది పూర్తయినా సాయం అందడం లేదని రైతులు వాపోతున్నా రు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఠంఛన్‌గా పెట్టుబడిసాయం విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్నది.

మురిసిపోతున్న అన్నదాతలు
తెలంగాణలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంబురంగా చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది. రైతు సంక్షేమమే ధ్యే యంగా ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, కో యిల్సాగర్లాంటి ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సహా పలు నూతన ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. అలాగే 24గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, నకిలీ విత్తనాల సరఫరాపై పీడీ యాక్డు, ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, పంటలబీమా, రు ణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ పథకం, ట్రాక్టర్లపై పన్ను, నీటి తీరువా పన్ను రద్దు తదితర ప థకాలను అమలు చేస్తోంది.
ఇందులో ప్రధానంగా రైతులకు పెట్టుబడిసాయం రైతుబంధు పథకం 2018నుంచి వానకాలం, యాసంగి సీ జన్లలో రెండుసార్లు ఎకరాకు రూ.5వేల చొ ప్పున అందజేస్తున్నది. తొలుత ఎకరాకు రూ.4 వేలు ఉండగా పెరిగిన ఖర్చుల మేరకు 2019-20నుంచి ఎకరాకు రూ.వెయ్యి పెంచుతూ రూ.5వేలను అందజేస్తున్నది. ప్రతిపక్షాలు ఈ పథకం అమలుపై దుష్ప్రచారాన్ని చేసినా ప్రభుత్వ ఖజానాపై భారం పడినా ఏడాదిలో రెండు పంటలకు రైతుబంధు సాయాన్ని సకాలంలో నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నది. దీంతో పంటల సీజన్లో రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను, బ్యాంకులను, చేతిబదులను ఆశ్రయించడం తప్పింది. ప్రభుత్వం అందజేసే రైతుబంధుతో పంటల సాగును ఆరంభిస్తున్నారు. ఈ క్రమంలో తాజా గా యాసంగి సీజన్లో రైతులకు పంటల పెట్టుబడులు బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. బ్యాంకులో రైతులు అందజేసిన సెల్‌ఫోన్ నెంబర్లకు ప్రభుత్వం నుంచే మెసేజ్‌లు వస్తున్నాయి.
తొలిరోజు ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు జమయ్యాయి. ఆ తర్వాత రెండోరోజు రెండు ఎకరాలకు, మూడోరోజు మూడెకరాలు క్రమంలో రైతులకు రైతుబంధు డబ్బులు ప్రభుత్వం అందజేయనున్న ది. ఇలా సంక్రాంతి నాటికి రైతుబంధు డబ్బులను రైతులకు అందజేయడం జరుగుతున్నది. ఈ సీజన్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా 10 లక్షల మందికిపైగా రైతులకు రూ.12వేల కోట్లకుపైగా నిధులు రైతుబంధు ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరనున్నది. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 3లక్షల మంది రైతులకు రూ.377కోట్లు అందనుండడం గమనార్హం. కాగా, కొత్త రైతులకు అవకాశం కల్పించనుండటంతో లబ్ధిదారులకు అందేసాయం పంపిణీలో మరింత మందికి లబ్ధి కలిగే అవకాశమున్నది.