కొల్లాపూర్, మార్చి 22 : కొల్లాపూర్‌లో సాగునీటి కోసం కొట్లాట మొదలైంది. కొల్లాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కృతిమ కరువును తీసుకొని వస్తోంది. సమాఖ్య పాలనలో కళ్ల ముందర నీళ్లు ఉన్నా పొలాలను బీడుగా పెట్టుకున్న రైతులు మళ్లీ కాంగ్రెస్ పాలనలో సమాఖ్య పాలన చీకటి రోజులను చూడాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్దార్తిప్ప, వీరానాయిని చెరువులకు సాగునీటిని నింపాలని ప్రతి ఎన్నికల్లో ఎన్నికల డిమాండ్‌గా ఉన్న సమస్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎగువ ఉన్న రైతుల కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి భూములను త్యాగం చేసినా రైతులకు సాగునీటి సమస్య లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయాలు వెచ్చించి మండల పరిధిలోని జిల్దార్తిప్ప, వీరనాయిని చెరువులకు కృష్ణానది నీళ్లను మళ్లించే పక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే జిల్దార్తిప్ప, వీరనాయిని చెరువుల పనులకు కేటాయించిన నిధులను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కూతవేటు దూరంలో కృష్ణానది ప్రవహిస్తున్నా పాలకుల నిర్లక్ష్యానికి సమీప గ్రామాల పొలాలు బీడుగా మారుతున్నాయి.
జిల్దార్తిప్ప చెరువు
కొల్లాపూర్ చూట్టు సాగునీటి ప్రాజెక్టులు ఉండి సమీపంలో కృష్ణానది ఉన్నా సమీపంలోని నల్లమల గ్రామాలైన మొలచింతలపల్లి, ముక్కిడిగుండం, గేమ్యానాయక్ తండా, ఎర్రగట్టు బొల్లారం గ్రామాలకు సాగు నీటిఎద్దడి ఉంటుంది. వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేస్తారు. ఈ ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రంగాదాసు సమయంలో జిల్దార్తిప్ప చెరువును అభివృద్ధి చేశారు. దీంతో చెరువు కింద వేలాది ఎకరాలు సాగు అయినట్లు రైతులు పేర్కొన్నారు.
అనంతరం పాలకుల నిర్లక్ష్యంతో జిల్దార్తిప్ప చెరువు అభివృద్ధి నిలిచిపోయింది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణానది నుంచి మినీ లిఫ్ట్ ద్వా రా మూడు పంప్‌లను ఏర్పా టు చేసి జిల్దార్తిప్ప చెరువుకు సాగునీరు అందించేందుకు శిలాఫలకం వేసి రూ.30 కోట్ల నిధులను కేటాయించారు. సర్వే పూర్తయి పనుల ప్రారంభంలోనే ఎన్నికల కోడ్ రావడంతో పను లు ఆగిపోయాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేం డ్లు దాటినా పనులు ప్రారంభించలేదని, మంజూరైన నిధులను క్యాన్సిల్ చేసి రైతుల ఉసురు తీసిందని రైతు సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా యి. జిల్దార్తిప్ప చెరువుకు సాగునీరు వస్తే చెరువు కింద ఐదువేల ఎకరాల దాక పంట లు సాగు అ య్యేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వీరనాయిని చెరువు
కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్‌బెట్ల గ్రామ శివారులో 38ఎకరాల విస్తీరణంలో ఉన్న వీరనాయిని చెరువుకు కింద వర్షాకాల పంటలు సాగు చేసుకుంటున్న రైతులు రెండు కార్ల పంటల కోసం వీరనాయిని చెరువుకు నీళ్లు ఎప్పుడు వస్తాయని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నాయకులు ఊర్లోకి రావడం వీరనాయిని చెరువుకు సాగునీరు అందిస్తామని హామీ ఇవ్వడం పారిపాటిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీరనాయిని చెరువుకు సింగోటం రిజర్వాయర్ నుంచి సాగు నీటిని అందించేందుకు 28 సెప్టెంబర్ 2023 న శంకుస్థాపన చేసి కాల్వ పనులను ప్రారంభించింది. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ వీరనాయిని చెరువుకు పాత రోజులు వచ్చాయని ఆ ప్రాంత రైతులు వాపోయారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగోటం రిజర్వాయర్ నుంచి గ్రా విటీ ద్వారా వీరనాయిని చెరువులోకి నీళ్లను నింపితే చెరువు కింద సమీప గ్రామాల్లో ఐదు వేల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లక్షలు పెట్టి పంట లు సాగు చేస్తూ సాగునీటి సమస్యతో భారీగా నష్టా లు చూడావల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీళ్లు అడుగంటిపోవడంతో చెరువు సమీపంలోని మామిడి పంటలు ఎం డిపోగా, మరికొంత మంది రైతులు తమ పొలాలను బీడుగా పెట్టడంతో కంపచెట్లతో నిండిపోయాయి.
మినీ లిఫ్ట్‌లను తలపిస్తున్న ఎన్మన్‌బెట్ల వాగు
వీరనాయిని చెరువులో వర్షాకాలం తర్వాత నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయని కొంతమంది రైతులు వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఐదు కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు తీసుకున్నారు. దీంతో సాగు నీటి కష్టం తప్పినా ఆర్థికభారంతోపాటు అదనపు శ్రమ రైతులను వేధిస్తోంది. ఎన్మన్‌బెట్ల గ్రామ శివారులోని వాగు నుంచి వీరనాయిని చెరువు వరకు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి కొంతమంది రైతులు వీరనాయిని చెరువుకు పైభాగం వరకు పైప్ లైన్లను తీసుకున్నారు. దీంతో ఎన్మన్‌బెట్ల వాగు వద్ద మినీ లిఫ్ట్‌లను తలపిస్తోంది.
మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు నీళ్లను పారబెట్టేందుకు 15 హెచ్‌పీ మోటర్లను వాడుతున్నారు. దీంతో ప్రతి మోటర్‌కు ఒక ట్రాన్సఫార్మర్ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏడాది కనీసం రెండు సార్లు మోటర్లు కాలిపొతున్నాయని మోటర్ బ్రేషులు, బేరింగ్లు పాడైపోతున్నాయని దీంతో రూ.20వేల దాకా ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. ఒక్కొక్కసారి మోటర్ చెడిపోయిందంటే రూ. 82వేలు పెట్టి కొత్త మోటర్‌ను తీసుకోవాల్సిందేనని దీనికి తోడు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు అదనపు ఖర్చుఅవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుతో కూడిన వ్యవసాయం చేస్తున్నామని ప్రభుత్వం వీరనాయిని చెరువుకు సింగోటం రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందిస్తే ఆర్థికభారం తగ్గుతోందని రైతులు పేర్కొంటున్నారు.
మరో అవకాశం లేదు
వీరనాయిని చెరు వు కింద రెండు ఎకరాలు భూమి ఉంది. వానకాలం మాత్రమే పంటలు సాగు చేసుకుంటా ప్రస్తుతం వరి సాగు చేస్తున్నాను పం ట చేతికి రావడానికి ఇంకా రెండు నెలల పది రోజులు పడుతోంది. కానీ చెరువులో ఒక నెల మాత్రమే నీళ్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పంట చేతికి వస్తుందో రాదో అనే భయం ఉంది. ఎన్నికల ముందు గత ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. ఈ ప్రభుత్వం పనులను నిలిపివేసింది. ప్రభుత్వం వెంటనే వీరనాయిని చెరువుకు సాగునీరు అందించి ఆదుకోవాలి.
– గాలెన్న, రైతు, ఎన్మన్‌బెట్ల
దశాబ్దాలుగా మోసపోతున్నాం
వీరనాయిని చెరువు కు సాగునీళ్లు ఇస్తామని ఎన్నికల ముందు హా మీ ఇచ్చిన ఎన్నికల త ర్వాత పాలకులు మ ర్చిపోతున్నారు. పనుల ను ప్రారంభించి నిలిపివేయడం రైతులను అవమానపర్చడమే అవుతో ంది. దశాబ్దాలుగా వీరనాయిని చెరువు కింద సా గు చేస్తున్న రైతులను పాలకులు మోసం చేస్తున్నారు. – సురేంద్ర, సీపీఎం గ్రామ కార్యదర్శి సాగునీరు అందించాలిజిల్దార్తిప్ప చెరువుకు కృష్ణానది నుంచి మినీ లిఫ్టు ద్వారా సాగునీరు అందించా లి. దీంతో చెరువు కిం ద ఐదువేల ఎకరాలు సాగు అవుతోంది. నల్లమల గ్రామాల దశాబ్దాల సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. సర్వేలతో కాలం గడపకుండా గత ప్రభుత్వం సూచించిన ప్రకారం లిఫ్టు ద్వారా సాగు నీరు అందించాలి.
– మేకల వరలక్ష్మి, సర్పంచ్, మొలచింతలపల్లి