మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. మీరు ఉండేది ఇంకా రెండున్నర ఏండ్లే బెదిరిస్తే భయపడేది లేదు.. అంటూ హెచ్చరించారు. మా పార్టీ కార్పొరేటర్లకు డ బ్బులు ఇస్తాం పదవులు ఇస్తాం వ్యాపారాలు చేసుకో ండి పోలీసులతో స హకరిస్తాం లేకపో తే ఫండ్స్ ఇవ్వం.. కే సులు పెట్టి స్తా ం.. అం టూ
ఫోన్లు చేస్తారా అంటూ మండిపడ్డారు. మీ కార్పొరేటర్లు కూడా చాలామంది ఇప్పటికీ నాకు టచ్‌లో ఉన్నారు.. మా పార్టీ జోలికి వస్తే మా తడాఖా చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలో ఎండాకాలం వస్తుంది తాగునీటి స మస్యను తీర్చం డి.. డివిజన్లలో మంచినీటి సమస్య కోసం 50 వేలు పెట్టి మోటర్లు కొనే తాహత్తు లేదు కానీ.. ఛాంబర్ కోసం రూ.30, 40 లక్షలు ఖర్చు పెడతారా? అంటూ ప్రశ్నించారు. అప్పుడే మా పార్టీ కా ర్పొరేటర్లు డీసెంట్ ఇద్దాం అంటే నేనే వారించిన.. కొత్తగా కార్పొరేషన్ అయింది ఎందుకులే అని వదిలేసినం.
మేము మొదలుపెట్టిన కార్యక్రమాలను పూర్తి చేయండి ప్రత్యేక ఫండ్ తీసుకొని రండి ఇవన్నీ వదిలేసి ప్రతిపక్షాల కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. గతంలో మిమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చిన వారందరి భవిష్యత్‌ను నాశనం చేయలేదా? ముందు మీ పార్టీలో ఉన్న నేతలకు పదవులు ఇవ్వండి అంటూ చురకలాంటిచారు. కార్పొరేషన్ కోసం మేము ప్రయత్నం చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత జీవో తెచ్చుకున్నారు.
ఇక్కడి నిధులు ఇక్కడే ఖర్చు చేసేందుకు మా హయాంలో ముడా ఏర్పాటు చేసాం. ముడా లేకుంటే అభివృద్ధికి నిధులు ఉండే వా? అని ప్రశ్నించారు. మేయర్.. డిప్యూటీ మేయర్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గొడవలు జరిగినాయి.. హోటళ్లల్లో డబ్బులు పట్టుకున్నారు.. అం దులో ఒక వర్గం మా దగ్గర వచ్చి కలుస్తామన్నా మే ము ఒప్పుకోలేదు.. ప్రజా తీర్పుకు అనుగుణంగా ము ందుకు వెళ్లామన్నారు. రెండు నెలలు కూడా కాలేదు.. బీఆర్ఎస్ కా ర్పొరేటర్లు పనికోసం పోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పనులు ఇస్తామని.. నిధులు ఇస్తామని అం టున్నారు ఇదెక్కడి న్యాయం అన్నారు.
ఒక మహిళా కార్పొరేటర్ భర్తకు ఫోన్ చేసి పార్టీలోకి వస్తే ముడా చైర్మన్ ఇస్తామని ఆఫర్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు. మేయర్ ఎన్నికల్లో మేము హుందాగా వ్యవహారించాం.. మీరు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. పోలీస్ అధికారులు సైతం కాంగ్రెస్ పార్టీ లో చేరాలని మా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు.. కొంతమంది అధికారుల వల్ల పోలీస్‌శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. ఎమ్మెల్యే మెప్పు కోసం ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం మంచిదికాదని హితవు పలికారు. మున్సిపల్ నిబంధనలు అనుసరించి సమానంగా ని ధులు ఇవ్వాలని.. లేదంటే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్లు నవకాంత్, శరత్‌రెడ్డి, రమేశ్‌నాయక్, కిశోర్‌కుమార్, మధుమోహన్, సత్యం, సీనియర్ నాయకులు కుర్వ శ్రీశైలం, శ్రీనునాయక్, సిద్ధిక్, జహంగీర్, ఖలీం, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.