మహబూబ్‌నగర్ రూరల్/జడ్చర్లటౌన్/బాలానగర్, జూలై 27: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నదని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. డీఆర్ఎం శరత్చంద్రయాన్తో కలసి ఆయన మ హబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్ రై ల్వే స్టేషన్లను సందర్శించారు. జడ్చర్ల రై ల్వేస్టేషన్లోని గూడ్స్ ప్లాట్‌ఫాం వద్ద ప నులను పరిశీలించారు. అలాగే రైల్వే హ మాలీ సంఘం భవనాన్ని పరిశీలించిన అనంతరం అక్కడే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మహబూబ్‌నగర్ సమీపంలోని ఆర్యూబీ వద్ద వరద నీటిలో స్కూల్స్ బస్సు ఇరుక్కుపోయిన ఘటనపై ఆయన స్పందిస్తూ రైల్వే ఇం ట్రా పనులు పూర్తయ్యే వరకు కొన్ని స మస్యలు తప్పవని పేర్కొన్నారు. ఆర్యూబీల వద్ద వరద నీరు నిల్వకుండా వాటర్ పంపింగ్, డ్రైనేజీ నిర్మాణం, లి ఫ్టింగ్ బ్యారియర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే వరద నీటి నిల్వ మా ర్కింగ్ను ఏర్పాటు చేశామని, మార్కింగ్ దాటి వరద నీరు ఉంటే అటుగా రాకపోకలను నిలిపివేస్తామన్నారు.
ప్రమాదకరంగా ఉన్న ఆర్యూబీల వద్ద వాచ్మెన్లను నియమించామని చెప్పారు. మహబూబ్‌నగర్-కర్నూల్ మధ్య జరుగుతు న్న రైల్వే పనులు పూర్తికాగానే అన్ని ఎలక్ట్రిక్ రైళ్ల రాకపోకలను పెంచుతామన్నా రు. 25వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే రైల్వే స్టేషన్లలో ఎ స్కలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మ హిళలు, వృద్ధులు, చిన్నారులు రైల్వే ప్లా ట్ఫాంలు దాటేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తుననట్లు తెలిపారు. జడ్చర్ల రైల్వేగేటు వద్ద ఆర్యూబీ నిర్మాణానికి అనుమతి లభించిందని, తొందరలోనే పనులు ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రైల్వే జీఎంను కలసి వినతిపత్రం సమర్పించారు. అన్ని రైళ్లు జడ్చర్లలో ఆపాలని, ఆర్యూబీ ప నులను తొందరగా చేపట్టి సమస్యను ప రిష్కరించాలని కోరారు. అలాగే రైల్వేస్టేషన్లో తెలుగు,హిందీ, ఇంగ్లిష్తో పా టు ఊర్దూలో బోర్డులను ఏర్పాటు చే యాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఎం శరత్చంద్రయాన్, డీసీఎ రాజ్‌కుమార్, డీఈఎన్ మోతీలాల్బోక్యా, సీనియర్ డీసీఎం శ్యాంకుమార్, సీనియర్ డీవోఎంలు వెంకన్న, కోటేశ్వర్రావు, సె క్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, బీఈఎన్ అనిల్‌కుమార్, జడ్చర్ల స్టేషన్ మాస్టార్ ఫరీద్, స్టే షన్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ ఉన్నారు.