హన్వాడ, మే 27 : మండలకేంద్రమైన హన్వాడలో ఆర్టీసీ బస్సులు ఆపకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులు, మహిళలు ప్రతిరోజూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపబడును అనే నిబంధన ఉన్నా కనీసం బ స్టాప్‌ల్లో ప్రయాణికులు కనిపిస్తున్నా ఆర్టీసీ సి బ్బంది బస్టాపుల వద్ద బస్సులు నిలుపడం లేదని, కొంతమంది డ్రైవర్లు అయితే బస్టాప్‌కు దూరంగా బస్సులను నిలిపి ప్రయాణికులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. కొద్ది మంది చేసేది లేక ఆర్టీసీ బస్సు లు ఆపరని ప్రైవేట్ వాహనాలను పట్టుకొని తమతమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలను చూస్తే ఆర్టీసీ సిబ్బంది బస్సు లు ఆపకుండా వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథ కం ఎందుకు ప్రవేశపెట్టిందిరా నాయన మమ్మల్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నదని మహిళలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి నిత్యం నెలకొన్నది. ఏది ఏమైనా ఆర్టీసీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు
స్పందించి బస్టాపుల వద్ద బస్సులు నిలుపకుండా వెళ్తున్న ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకొని ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం ఉన్నది.