మహబూబ్‌నగర్ టౌన్, జవవరి 5 : సంక్రాం తి పండుగ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు దృష్టి సా రించారు. మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 360 అదనపు బస్సు స ర్వీసులు నడపనున్నారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు అదనపు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఇతర ప్రాంతాలు, పట్టణాల నుంచి పం డుగకు ప్రజలు సొంతూళ్లకు, బంధువుల ఇండ్లకు వెళ్లనున్నారు.
అందుకోసం హైదరాబాద్‌కు అదనపు సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు చేశారు. అ న్ని డిపోలకు హైదరాబాద్ రూట్లోలోనే ఎక్కువ ఆ దాయం వస్తున్నది. దీంతో ఈ రూట్లోనే అధికంగా సర్వీసులు, సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నా రు. పండుగ తర్వాత తిరుగు ప్రయాణ సమయంలోనూ రద్దీ దృష్ట్యా ఎక్కువ బస్సులు నడిపించనున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు అదనపు బస్సులు(సూపర్ లగ్జరీ) నడపనున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి 14 ప్రత్యేక లగ్జరీ బస్సులు హైదరాబాద్ ఎంజీబీఎస్‌కు, అక్కడి నుంచి విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, విశాఖప ట్నం, కాకినాడ, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. శనివారం నుంచి 14వ తేదీ వరకు నడవనున్నాయి. వీటిలో ప్రయాణించే వా రు ముందుస్తు బుకింగ్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. అధికారులుతో ఆర్ఎం శ్రీదేవి సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు.
మహబూబ్‌నగర్ డిపో నుంచి 54, షాద్‌నగర్ నుంచి 63, వనపర్తి నుంచి 51, గద్వాల నుంచి 42, నా రాయణపేట నుంచి 35, కొల్లాపూర్ నుంచి 32, నాగర్‌కర్నూల్ నుంచి 30, కల్వకుర్తి నుంచి 27, అచ్చంపేట నుంచి 26 బస్సులను అదనంగా నడపనున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. రద్దీ మేరకు మరిన్ని బస్సులు నడుపుతామని చెప్పారు.