కొల్లాపూర్, జనవరి 17 : సంక్రాంతి పండుగ సందర్భంగా చార్జీలు అధికంగా వసూలు చేసిన ఆర్టీసీ ఇదే తంతును సింగోటం జాతరకు సైతం కొనసాగిస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని సింగోటం లో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి జాతర వెళ్లే భ క్తులకు, ప్రయాణికుల జేబుకు ఆర్టీసీ చిల్లు పెడుతోం ది. జాతరలను సైతం వదలకుండా ఆర్టీసీ స్పెషల్ చార్జీల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆంధ్రా రూట్లలో మాత్రమే ప్రత్యేక చార్జీలు ఉండగా, ప్రస్తుతం కొల్లాపూర్లో సైతం పండుగల సందర్భంగా స్పెషల్ చార్జీలు వడ్డిస్తున్నారు.
ప్ర యాణికులకు మెరుగైన సే వలందిస్తామని గొప్పలు చెప్పే ఆర్టీసీ అధికారులు ఇ లా ముక్కుపిండి డ బ్బులు అధికంగా వసూలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కర్నూల్ నుంచి కొల్లాపూర్ వరకు రూ.170 లు ఉండగా, జాతర సందర్భంగా రూ.100 అధికంగా వసూలు చేస్తూ రూ.270లు తీసుకుంటున్నారు. అలాగే కొల్లాపూర్ నుంచి సింగోటం వరకు రూ.20 ఉండగా, మరో పది అధికంగా వసూ లు చేస్తున్నారు. అధికంగా వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి పురుషులతో రెండింతలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇచ్చేది కొసరు.. వసూలుతో ఎసరు..
కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేందుకు అమలు కానీ హామీలను ఇచ్చి నేడు వాటిని నెరవేర్చలేక తంటాలు పడుతున్నది. గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు కోత పెట్టడంతోపాటు ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. కోసరు ఇచ్చి అసలు వసూలు చేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నది.
– దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు