కొల్లాపూర్, జూన్ 6 : బ్రిటీష్ రాజులు, నిజాం నవాబులు మెచ్చిన సురభిరాజుల సంస్థానంగా కొల్లాపూర్ కీర్తి ప్రతిష్టలు సాధించింది. ప్రకృతి ప్రేమికులను, ఆధ్యాత్మక వాదులను నిత్యం ఆకర్షించే నల్లమల వంపులు, సప్తనదుల సోయగాలకు నెలువుగా వున్న కొల్లాపూర్‌కు ఆర్టీసీ సర్వీసులు మచ్చను తెస్తున్నాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లాపూర్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో తెలంగాణ రాష్ట్ర నలమూలల నుంచి మాత్రమేకాక ఇతర రాష్ర్టాల నుంచి కొల్లాపూర్‌కు పర్యాటకులు వస్తుంటారు. కానీ వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు సరైనా రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులను పడుతున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా దవాఖానల అవసరాల నిమిత్తం అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లిన వారు రాత్రి సమయాల్లో కొల్లాపూర్ రావాలంటే జంకుతున్నారు. తప్పని పరిస్థితిలో కొల్లాపూర్ ఆర్టీసీ బస్సును ఎక్కాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రయాణికులు కొల్లాపూర్ రావడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. కొల్లాపూర్ డిపో నుంచి హైదరాబాద్‌కు 29 సర్వీసులు, పెబ్బేరుకు 9, వనపర్తికి 8 సర్వీసులు నడుస్తున్నాయి.
అయితే సాయంత్రం పూట బస్సుల కెపాసిటీకి మించి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సు సర్వీసులు లేకపోవడంతో ఒక బస్సులో వంద మందికిపైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఫుట్‌పాత్‌పై ప్రయాణం చేస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్పితే ప్రయాణికుల సంఖ్య కు అనుగుణంగా బస్సులను నడపడం లేదు. కొల్లాపూర్ నుంచి బస్సు సర్వీసులు రాత్రి ఎనిమిది గం టలకే బంద్ అవుతున్నాయి. ఎన్నోసార్లు మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గానికి బస్సులే కరవయ్యాయి.
హైదరాబాద్ నుంచి సాయంత్రం సమయంలో కొల్లాపూర్ సర్వీసు ఆధ్వానంగా వున్నది. రాత్రి 8:30 గంటలు దాటింది అంటే హైదరాబాద్‌కు కొల్లాపూర్‌కు రావాలంటే క్యాలెండర్లో రోజు మా రాల్సి వస్తోంది. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్‌కు సాయంత్రం ఆరు గంటలకే చివరి బస్సు బయల్దేరుతోంది. వివిధ పను ల నిమిత్తం రాజధాని వెళ్లిన వారు రాత్రి ఎనిమిదిన్న ర తర్వాత కొల్లాపూర్‌కు రా వాలంటే రాత్రి 11గంటల వరకు ఎదురు చూడాలి.
దీంతో ఎన్ని పనులున్నా వదులుకొని హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో 8:30 గంటల బస్సుకు ఎక్కేందుకు ప్రయాణికులు వందలాదిగా పోటీలు పడుతున్నారు. దీంతో ఎంజీబీఎస్‌లోనే 8:30 గంటల బస్సుకు 120 మందిదాక ప్ర యాణికులు బస్సు ఎక్కుతున్నారు. ముసలి ముతక బస్సు ఎక్కేందుకు అవకాశం లేక అవస్థలు పడే స్థితి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
11 గం టల అఖరి బస్సుకు అయితే కష్టపడి ఎక్కినా సీట్లు దొరకడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరాంఘర్, శివరామ్‌పల్లి తదితర బస్సు పాయింట్ల వద్ద వేచి చూసే ప్రయాణికులకు ప్రైవేట్ వాహనాలు తప్పా ఆర్టీసీ సర్వీసు ఎక్కే అవకాశమే లేకుండా పోయింది. హైదరాబాద్‌లో స్టాండింగ్‌లో వున్న వారు కొల్లాపూర్‌కు వచ్చేంతే వరకు అంటే దాదాపు నాలుగు గంటలకు పైగా స్టాండింగ్‌లోనే ప్రయాణించవాల్సి వస్తోందని చంటి పిల్లలతో, గర్భణులతో, దవాఖానల్లో వైద్యం చేయించుకొని తిగివస్తున్న రోగులు సైతం నరకయాతన అనుభవిస్తున్నామని ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు.
రాజధాని నుంచి 8:30 తర్వాత 11 గంటల వరకు బస్సు సర్వీసు రావడానికి మధ్యలో దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. బస్సుల మ ధ్య గ్యాప్‌ను భర్తీ చేయాలని ప్రయాణికులు, ప్రజా సంఘాల నాయకులు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మంత్రి నియోజకవర్గ కేంద్రంలోనే ఆర్టీసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంటే గ్రామీణ రవాణా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు బ స్సు ఎక్కేందుకు సాధ్యం కాకపోవడంతో అఖరి బ స్సు 11గంటలకు ఎక్కేందుకు వెళ్లితే 115 మంది ప్రయాణికులు ఎక్కడంతో స్టాండింగ్తోనే బస్సు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వచ్చినట్లు చెప్పారు.
హైదరాబాద్ నుంచి రాత్రి కొల్లాపూర్ రావాలంటే భయంగా వుంటుం ది. ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కిన సీట్లు దొరకడం క ష్టంగా ఉంటుంది. బస్సు లో ఉపిరి కూడా ఆడదు. దవాఖానకు వెళ్లి కొల్లాపూర్ బస్సు ఎక్కితే మళ్లీ దవాఖాన కోసం బస్సు ఎక్కవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని 8:30 తర్వాత ఆర్టీసీ సర్వీసును నడపాలి.
– జక్కుల నరసింహ, పెద్దకొత్తపల్లి ఉన్నతాధికారుల దృష్టికి
హైదరాబాద్ నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంట ల తర్వాత మరో సర్వీసును ఎలా నడపాలో అర్థం కావడం లేదు. డిపో మేనేజర్ సెలవులల్లో ఉన్నాడు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను.
– డిపో ఇన్చార్జి రత్నమ్మ