అయిజ, జూన్ 29 : రిజర్వేషన్లను మతంతో కలపొద్దని, మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు ఎత్తివేయవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం అలంపూర్ నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ రిజర్వేషన్ పో రాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆర్ఎస్పీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రా జ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులను హరించే విధంగా సుప్రీం కోర్టులో తీర్పు రావడం దురదృష్టకరమన్నారు. దేశంలో జన్మించిన కులం, మతం, లిం గం, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపరాదన్నారు. ఓసీలు, బీసీలు, ఎస్టీలకు ఒక విధమైన రిజర్వేషన్లు, ఎస్సీలకు మతపరమైన కల్పించడమేమిటని అ న్నారు.
దళితుల క్రైస్తవు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులతో కలిసి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని మతాలకు సమానంగా రిజర్వేషన్లు కల్పించే విధంగా రాజ్యాం గం కల్పించిన హక్కు అన్నారు. అట్టి హక్కుల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీలోని జస్టిస్ కేజీ బాలకృష్ణనన్ కమిటీ ముందు దళిత క్రైస్తవ హక్కులపై పెట్టామన్నారు. దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ ఏ ఒక్కపార్టీ దళితుల పక్షాన జస్టిస్ కమిటీ ముందుకు వెళ్లకపోవడం సిగ్గుచేటన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. ఎస్సీలకు మతపరమైన స్వేచ్ఛ ను ఇచ్చే వరకు బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తుందన్నారు.
ఎస్సీ హోదా దళిత క్రైస్తవుల హక్కు అని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ స్పష్టం చేశా రు. ఇందుకోసం పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరిని కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. అలంపూర్ నుంచి అయిజ వరకు 70కిలోమీటర్లు దళిత క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీలో నిర్వహించగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వేలాది సంఖ్యలో పాస్టర్లు, దళిత క్రైస్లవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1950 నాటి రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వులో హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు ఆచరించే దళితులకు మాత్రమే ఎస్సీ హోదాను పరిమితం చేసిందన్నారు. వెంటనే సవరణ చేపట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. దీని కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌చేశారు.
మతం మారినంతా మాత్రన కులం మారిపోదని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. ఇదే విషయాన్ని గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దళితుల క్రైస్తవులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దానికి అనుగుణంగానే ఈ నెల 9న బీఆర్ఎస్ పార్టీ బృందాన్ని ఢిల్లీకి పంపించి కేజీ బాలకృష్ణ కమిషన్ ముందు పార్టీ తరఫున దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించామని గుర్తుచేశారు. నాగర్‌కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమఆర్ను గెలిపించి ఉంటే మన గొంతుకగా పార్లమెంట్లో కోట్లాడే వాడని తెలిపారు. ఇప్పుడు గెలిచిన ఎంపీ అసలు దళిత క్రైస్తవుల గురించి పట్టించుకోవడమే లేదన్నారు.