IBM: కుప్పకూలిన ఐబీఎం స్టాక్స్.. సుమారు 70 బిలియన్ల డాలర్ల నష్టం
IBM : ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. మంగళవారం ఒక్క రోజే సుమారు 25 శాతం షేర్లు ఢమాల్ అయ్యాయి. దీంతో ఆ కంపెనీ సుమారు 70 బిలియన్ల డాలర్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది.
న్యూయార్క్: ఐబీఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. మంగళవారం ఒక్క రోజే సుమారు 25 శాతం షేర్లు ఢమాల్ అయ్యాయి. రెండో క్వార్టర్‌కు చెందిన ఫలితాలను అమెరికా కంపెనీ రిలీజ్ చేసింది. ఆ ఫలితాల ఆధారంగా స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. గడిచిన 58 ఏళ్లలో ఆ కంపెనీ షేర్లు ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. షేర్లు పడిపోవడం వల్ల ఐబీఎం కంపెనీ సుమారు 70 బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. 1911లో ఐబీఎం కంపెనీ స్థానపించారు. అయితే జూన్‌లో ఆ కంపెనీ రెవన్యూ కేవలం ఒక్క శాతం 17.2 బిలియన్ల డాలర్లు మాత్రమే పెరిగింది. తమ కంపెనీ విఫలమైందని, పరిస్థితులకు తగినట్లు ముందుకు వెళ్లలేకపోయిందని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు లేఖలో పేర్కొన్నారు.
ఐబీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌లో ఏడు శాతం రెవన్యూ పతనమైంది, సాఫ్ట్వేర్ రెవన్యూ అయిదు శాతం పెరిగినా.. అంచనాలకు తగినట్లుగా లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్‌ను తమ కంపెనీ అందుకోలేకపోయినట్లు అరవింద్ కృష్ణ వెల్లడించారు. చాలా వరకు పెద్ద కంపెనీలతో తమ డీల్స్ జరగలేదని ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత ప్రాముఖ్యత పెరిగిపోవడంతో తమ కంపెనీ కొత్త డీల్స్ చేసుకోలేకపోయినట్లు ఆయన చెప్పారు. 1987లో వచ్చిన బ్లాక్ మండే క్రాష్ కన్నా దారుణంగా ఈసారి షేర్లు పడిపోయినట్లు తెలిపారు. ఐబీఎం మార్కెట్ విలువ సుమారు 272 బిలియన్ల డాలర్లు. దాంట్లో సుమారు 70 బిలియన్ల డాలర్లు ఆ కంపెనీ నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

