మహబూబ్‌నగర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార పార్టీలో చ క్రం తిప్పుతున్న ఓ నేత ఏకంగా డిప్యూటీ మేయర్ కావడంతో ఆగమేఘాల మీద ఆయన కోసం ఓ చాంబర్‌ను రెడీ చేస్తున్నారు. ఖరీదైన కుర్చీలు.. సీఎం చాంబర్‌ను తలదన్నే కార్పెట్లు, సోఫాలు, కిటికీలకు కర్టెన్లు.. సెంట్రల్ ఏసీ.. ఆధునిక వాష్‌రూమ్ ఒకటేమిటి సకల సౌకర్యాలు క్షణాల్లో వాలిపోతున్నాయి. దీనికోసం ఏకం గా రూ.32 లక్షలు ఖర్చు పెట్టి చాంబర్ ఏ ర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మా రింది. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారాక మేయ ర్ హోదా పొందిన బీసీ మహిళకేమో పాత చాంబర్ కట్టబెట్టి డిప్యూటీ మేయర్ కోసం కొత్త చాంబర్‌ను లక్షలు పోసి రూపురేఖలు మార్చడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేకి సైతం లేని ఇలాంటి చాంబర్ డిప్యూటీ మేయర్‌కు ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన పలుకుబడి ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు.
శనివారం జరిగిన నగరపాలక సంస్థ తొలి సమావేశంలో రూ.కోటి 7లక్షల పనులకు కౌన్సిల్లో ఆమోదం కోసం పెట్టగా ఇందులో ఏకంగా రూ.32లక్షలు డిప్యూటీ చైర్మన్ చాం బర్ రూపురేఖలను మార్చేందు కు పేర్కొనడం గమనార్హం. నగరపాలక సం స్థ తొలి సమావేశంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో మే యర్‌తో పాటు డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే వేదికపై కూర్చోవడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుబట్టారు. రాష్ట్రంలో ఎక్కడాలే ని సంస్కృతీని ఇక్కడ తీసుకొస్తున్నారని మండిపడుతూ వాకౌట్ చేశారు. ఇంకేముంది కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేట ర్లు, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బడ్జెట్‌ను ఆమోదించి బయటికి వచ్చేసారు.
మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థగా మారాక బీసీ మహిళకు మేయర్ పదవి దక్కగా.. డిప్యూటీ మేయర్‌గా సురేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో ఆయ న ఎంత చెబితే అంతగా మారిపోయింది. గతంలో వైస్ చైర్మన్లకు పెద్ద గా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఇక కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతుండడంతో ఆ యన కోసం ఏకంగా రూ. 32లక్షల పెట్టి కొత్త చాంబర్ రెడీ చేయించడం అందు లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో సొంత పార్టీ కార్పొరేటర్లు ము క్కున వేలేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు లేనంతగా డిప్యూటీ మేయర్ చాం బర్లో సౌకర్యాలు కల్పిస్తున్నారట.. నగరపాలక సంస్థలోనే ఓ మూలన ఉన్న గదిని కేటాయించారు.
తుది మెరుగులు దిద్ది కుర్చీలు టేబుల్లు వేస్తే సరిపోయే దానికి రూ.32 లక్షల ప్రజాధనాన్ని వృ థా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గోడలకు మెరుగులు దిద్దడం, టేకు తలుపులు.. గ్లాస్ డోర్స్ కోసం ఏకంగా రూ.16.5 లక్షలు, ఎలక్ట్రిసిటీ, వాష్ రూమ్ వాటర్ సప్లై కోసం మరో రూ.5,50, 000, ఫర్నీచర్ ఎయిర్ కండిషన్ కోసం రూ.పది లక్షలు ఖర్చు చేస్తారట.. ఇవన్నీ కలిపి రూ.32లక్షలతో డిప్యూటీ మేయర్ చాంబర్ రెడీ చేస్తున్నారు. రూ.5లక్షలు కూడా ఖర్చు కానీ ఈ చాంబర్ కోసం రూ.32లక్షలు ఖర్చు చేయ డం వెనుక మతలబు ఏమిటో అర్థం కావ డం లేదు. జిల్లా కేంద్రంలో ఒకవైపు తాగునీళ్ల లేక.. మరోవైపు వీధి దీపాలు లేక జనం ఇబ్బందులు పడుతుంటే డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం ఇన్ని లక్షలు ఖర్చు చేస్తారా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.