మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 : మానవాళి మ నుగడ, సుస్థిర అభివృద్ధికి కెమిస్ట్రీ పాత్ర కీలకమని పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్‌రాథోడ్ అన్నారు. మంగళవారం పీయూలోని గ్రంథాలయం ఆడిటోరియంలో ‘కెమిస్ట్రీ ఫర్ ఏ సస్టెయినబుల్ ఫ్యూచర్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పీయూ వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని, అప్పు డే నూతన ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంటుందన్నారు. నోట్ స్పీకర్ ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులను పరిశోధనల వైపు నడిపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఫెలోషిప్‌లు ఇస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు.
దేశంలో 37 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయని, మహిళలు వాటిపై మక్కువ చూపడం లేదన్నారు. నేచర్ గొప్ప శాస్త్రవే త్త అని.. మందులు 80 శాతం ప్రకృతి నుంచే పొం దుతున్నామని పేర్కొన్నారు. వెహికిల్స్, ఎలక్ట్రాని క్స్, గృహ నిర్మాణ రంగంలో కెమిస్ట్రీ ముఖ్య పాత్ర వహిస్తుందన్నారు. అనంతరం ఐఐసీటీ కన్వీనర్ శ్రీ ధర్‌రెడ్డి మాట్లాడుతూ వందకు పైగా అబ్స్ట్రాక్ట్స్ వ చ్చాయని, 200మంది మెంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రి జిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ చంద్రకిరణ్, ఈసీ మెంబర్ నూర్జహాన్, కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, కో కన్వీనర్లు రామ్మోహన్, అయేషా హష్మీ, రవికుమార్, సిద్ధరామగౌడ్, రూపారాణి, రామరాజు, బేబీ లత, దీప్తిరెడ్డి, స్కాలర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.