మక్తల్, నవంబర్ 22 : కాంగ్రెస్ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యా యి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. స్వయాన మంత్రి శ్రీహరి ఇలాకాలో దారుణంగా త యారయ్యాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారి నరకప్రాయంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్ర యాణికులు జంకుతున్నారు. రెండు పట్టణాల మధ్య 30 కిలోమీటర్ల రోడ్డులో దాదా పు 10 కి.మీ. మినహా మిగితాది పాడైపోయింది. దీంతో ప్రయాణం ప్రమాదాలకు పి లుపుగా మారాయి. దీనికితోడు రోడ్డుపై వాహనాలు వెళ్తుంటే దుమ్ముతో వెనుక వచ్చే వారికి రోడ్డు కనిపించడం లేదని వాహన డ్రైవర్లు వాపోతున్నారు.
నిత్యం వందల సం ఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా.. కొత్త రోడ్డు వేయడంపై అధికారులు దృష్టి సా రించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాలు రాపోకలు సా గిస్తుండడంతో పెద్ద మొత్తంలో గుంతలు ఏ ర్పడ్డాయి. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినా.. అప్పటి వరకు హడావుడి కనిపిస్తుందే తప్పా కొత్త రోడ్డు వేయడం లేదు. శనివారం మక్తల్‌లోని రోడ్డుపై వెళ్తున్న డీసీ ఎం గుంతలో ఒక్కసారిగా కూరుకుపోయి ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, స్థానికులు డీసీఎం ఒరిగిపోకుండా సపోర్ట్‌గా కట్టెలను ఉంచారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మాత్రం ఈ రోడ్డుపై కామనే అం టూ మాట్లాడుకోవడం కనిపించింది. తర చూ వాహనాల పరిస్థితి ఇదే.. మోకాళ్లలోతు గుంతల రోడ్డుపై ప్రయాణం చేయాలంటే స మయం వృథా అవుతుందని వాహనదారు లు ఆవేదన చెందుతున్నారు.
రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారడంతో ప్రజాప్రతినిధులకు గానీ.. ఆర్అండ్బీ అధికారులకు గానీ కొత్తగా వేయాలి.. లేదా.. మరమ్మతు లు చేపట్టాలన్న ధ్యాస పెట్టడం లేదు. ఎవరికైనా అత్యవసరమైతే అంబులెన్స్‌లు వెళ్లాల న్నా.. దవాఖానకు వెళ్లాలన్నా ప్రాణా లు గాలిలో దీపంలా పెట్టుకొని వెళ్లాల్సిందే.. గత కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి ప్ర తిపాదనలు సిద్ధం చేశాక.. ఎన్నికలు రావ డం.. కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొందడంతో కొత్త రోడ్డుకు అడుగులు పడలేదు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలా రోడ్లు ఉంటే.. ఇక మారుమూల పల్లెల్లో ఏమిటీ పరిస్థితి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ రోడ్డును నాలుగులేన్లుగా మార్చేందుకు మంత్రి శ్రీహ రి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
అధి కారులు స్పందించి గుంతలతో ఇబ్బందులు
మక్తల్ నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు, పూర్తిస్థాయిలో గుంతల మయంగా మారడం వల్ల రోడ్డుపై, ప్రయాణం చేయాలంటేనే నరకంలా అనిపిస్తుంది. ముఖ్యంగా అత్యవస సమయాల్లో రోగులను జిల్లా దవాఖానకు ఈ రోడ్డుపై తీసుకువెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొన్నది. అధికారులు, పాలకులు స్పందించి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి.
– రాజు, మక్తల్
రూ.270 కోట్లతో..
మక్తల్ నుంచి దాదాపు 27 కి.మీ. నాలుగు లేన్ల రోడ్డు కోసం, మ ంత్రి ఆదేశాల మేరకు రూ. 270 కోట్లతో ప్రతిపాద నలు ప్రభుత్వానికి పంపించాం. ఆదేశా లు వచ్చాక పనుల కు టెండర్లు
పిలుస్తాం.
– శ్రీహరి, ఆర్అండ్బీ డీఈ