వనపర్తి, జూన్ 19(నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు పట్టిన గ్రహణం వీడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉరుకులు..పరుగులు పెట్టిన విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అ మాంతం ఆగిపోవడం చర్చనీయాంశమైం ది. రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం విస్తరణ పనులు ఒక్క అడుగు కూడా ముం దుకు పడటం లేదు. అసంపూర్తి పనులు… అసౌకర్యాల రోడ్లతో జిల్లా కేంద్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఏళ్ల తరబడి ఎదురు చూసిన రోడ్ల విస్తరణ పను లు చివరి దశ చేరినా వాటిని కూడా చేయలేకపోవడంపై పట్టణ ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 6 కిలోమీటైర్లెతే..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రజల చిరకాల కోరికగా జిల్లా కేంద్రంలో ని రోడ్ల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. విస్తరణపై అనేక సవాళ్లున్నప్పటి వాటన్నింటినీ అధిగమించి సాహసోపేత నిర్ణయంతో జెట్ వేగం తో పనులను నడిపించారు. మొత్తం 6కిలోమీటర్ల రోడ్డు, మరో మూడు బ్రిడ్జిలు రోడ్ల విస్తరణలో ప్రధానంగా ఉన్నాయి. వీటిలో బ్రిడ్జిల పనులు పూర్తి కాగా, బీఆర్ఎస్ ప్ర భుత్వం దిగిపోయేనాటికి దాదాపు 4.2 కి లోమీటర్ల రోడ్ల విస్తరణ కూడా పూర్తయ్యిం ది. విస్తరణ పనుల చివరలో ఉండగా ప్రభు త్వం మారి పోవడం.. ఎమ్మెల్యేగా తూడి మేఘారెడ్డి గెలుపొందడం జరిగిపోయింది.
కాంగ్రెస్ సర్కారులో కదలని పనులు..
అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వంలోనే మెజార్టీ పనులు జరిగిన విస్తరణకు ఈ సర్కారులో పూర్తి బ్రేకులు పడ్డాయి. కొద్దిమేర మాత్రమే పనులున్నాయి. అయితే, కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి విస్తరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. గతంలో కన్నా వేగంగా కొత్త ఎమ్మెల్యే విస్తరణ పనులను పూర్తి చేయిస్తాడని ఆశించిన పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. ప్రసంగాలు తప్పా పనులెక్కడా లేవన్న విమర్శలు ప్రజల నుంచి వెలువెత్తుతున్నాయి. అర్థాంతరంగా ఆగిన పనులను రెండేళ్లవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెబ్బేరు రోడ్డు పెండింగ్..
ప్రధానంగా విస్తరణలో పెబ్బేరు రోడ్డు పాలిటెక్నిక్ నుంచి రామాలయం వరకు పెండింగ్ పడింది. ఈ దారిలో అన్ని కమర్షియల్ షాపులే ఉన్నాయి. ఇదే రోడ్డులో ఊరి చివర రామాలయం అనంతరం కొద్దిమేర సైడ్ కాల్వలను చేపట్టి మున్సిపాలిటీ వదిలేసింది. అత్యవసరం ఉన్న చోట వదిలి అంతగా సమస్య లేని ప్రాంతానికి వెళ్లి పనులను చేయడం విమర్శలకు దారితీసింది. అలాగే పాన్‌గల్ రోడ్డులో మున్సిపల్ కార్యాలయం నుంచి ఫరీద్ రైస్ మిల్ వరకు విస్తరణ చేయాల్సి ఉంది. ఈ మార్గంలో కొన్ని నివాస గృహాలు ఉండగా, కొందరు సొం తంగానే తొలగించుకున్నప్పటికీ పనులు మొదలు కాలేదన్న విమర్శలున్నాయి. ఇక అధికారులు, ఎమ్మెల్యే కూడా అనేక సమీక్షలు నిర్వహించినా ఫలితం లేదు. ఒకింత పట్టణ వాసులకు రోడ్ల విస్తరణ విసుగెత్తిస్తుంది. విస్తరణపై ఎవరిని కదిలించినా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేైళ్లెనా కదలికలేదన్న ప్రశ్నలే ఉదయిస్తున్నాయి.
రూ.49 కోట్ల అంచనాతో..
జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణను రూ. 49.7కోట్ల అంచనాతో చేపట్టారు. నాలుగు రోడ్లకు కలిపి 6 కిలోమీటర్ల పొడవు, మరో 3 బ్రిడ్జిల నిర్మాణాలను ఈ బడ్జెట్లో రూపొందించారు. రెండేళ్ల కిందట ప్రారంభమైన ఈ పనులను నాలుగు విభాగాలుగా చేపట్టారు. వీటిలో చిట్యాల రోడ్డు, గోపాల్పేట రోడ్డు, పాన్‌గల్ రోడ్డు, పెబ్బేరు రోడ్డుగా ఉన్నాయి. వీటిలో చిట్యాల, గోపాల్పేట రోడ్డు పనులు జరిగాయి. గోపాల్పేట రోడ్డు వైపు విస్తరణలో మూడు కిలోమీటర్ల రోడ్డుంటే పూర్తి చేశారు. మరో రెండు బ్రిడ్జిలు కూడా పూర్తి చేశారు. చిట్యాల రోడ్డు పనుల వారీగా చూస్తే..
ఇందులోను 3 కిలోమీటర్ల రోడ్డును ముగించారు. మొత్తంగా మిగిలిన రోడ్డు 1.8 కిలోమీటర్లుగా ఉంది.
మున్సిపాలిటీ క్లియర్ చేయాలి
మిగిలిన రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలంటే.. మున్సిపాలిటీ క్లియర్ చేసి ఇవ్వాలి. అప్పుడే రోడ్డు పనులు చేసే అవకాశం ఉంటుంది. ఉన్న ఆడ్డంకులు తొలగాలి, డ్రైనేజీ ఏర్పాటు, విద్యు త్ స్తంభాల తొలగింపు చేస్తే మా పనులు మొదలవుతాయి. మున్సిపల్ అధికారులు రోడ్లపై కట్టడాలు తొలగించనిదే తాము చేసేదేమీ లేదు. -రాకేశ్, ఏఈ, రోడ్లు భవనాల శాఖ, వనపర్తి