పాలమూరు, జూన్ 9 : జేఈఈ 2024 ఫలితాల్లో మహబూబ్‌నగర్‌లోని రిషి ఐఐటీ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారని అకాడమీ కరస్పాండెంట్ చంద్రకళావెంకట్, సలహాదారు వెంకటయ్య, డీన్ భూపాల్‌రెడ్డి తెలిపారు. ఈ ఫలితాల్లో ఎస్టీ విభాగంలో యువజరాజ్నాయక్ ఆలిండియా 805వ ర్యాంక్, జోయల్కుమార్ ఎస్సీ విభాగంలో 1,251వ ర్యాంక్, కౌషిక్యాదవ్ ఓబీసీ కేటగిరీలో 4,461వ ర్యాంక్, వంశీచంద్ర బీసీబీ కేటగిరీలో 8,204వ ర్యాంక్, సాయి ప్రతీక్ష ఎస్సీ కేటగిరీలో 7,950వ ర్యాంక్, సాకేత్సింగ్ జనరల్ కేటగిరీలో 14,741వ ర్యాంక్ సాధించి జిల్లాకు గుర్తింపు తెచ్చారని అకాడమీ యాజమాన్యం తెలిపింది. పోటీ పరీక్షల కోసం అనుభవన్ఞులైన అధ్యాపకులతో శిక్షణనిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని కరస్పాండెంట్ చంద్రకళావెంకట్ తెలిపారు.