మహబూబ్‌నగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణ, భీమా తుంగభద్ర నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి జిల్లాలో పర్యటించారని మాజీ మంత్రులు డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి, వి శ్రీని వాస్‌గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కా ర్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మె ల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజ య్య యాదవ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ కార్యాచరణ చేపడుతామని ప్రకటించగానే భయపడి ఈనెల 4, 5వ తేదీల్లో సీఎం, మంత్రులతో కలిసి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష అంటూ చేసిన హడావుడి అంతా పక్క రాష్ట్ర ప్ర యోజనాల కోసమే అన్నట్లుగా స్పష్టమవు తుందన్నారు. ఈ జిల్లాకు వచ్చి ఉన్నతాధికారులతో సమీ క్షించి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పకుండా ఎన్ని నిధులు ఖర్చు చేస్తారో ప్రజలకు వివరించకుండా కేవలం విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చార న్నారు. అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెడుతు న్నారని.. కేసీఆర్ ప్రభుత్వ హ యాంలోనే 27వేల ఎకరాలు భూసేకరణ చేసి రూ.35వేల కోట్లు ఖర్చుపెట్టి 90శాతం ప్రా జెక్టును పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. అధి కారంలోకి వచ్చి రెం డున్నరేండ్ల్లలో కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట కుండా ఈ జిల్లాలోని ప్రాజెక్టులకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం అబద్ధాలు చెప్పారని ధ్వజ మె త్తారు.
అప్పులకు వడ్డీలు కడుతున్నా అసలు కడు తున్న మంటూ అబద్ధాలు వల్లించడం తప్పితే పాల మూరు జిల్లాకు ఈ రెండున్నరేండ్లలో చేసింది ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమా ండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇదే పా ల మూరుకు వచ్చి మొత్తం క్యాబినెట్ మ ంత్రులను వేదిక ఉండగా ప్రతిఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామని ప్రజ లతో చప్పట్లు కొట్టించి రెండేళ్లయిన ఇప్పటివరకు రూ.20 కూడా తీసుకురాలేని చేతగాని సీఎం రే వంత్ అని విమర్శించారు. పాలమూరు రం గా రెడ్డిపై సీఎం స్థాయిలో చేసిన అబద్ధాల ప్రచా రాన్ని త్వరలో బట్టబయలు చేస్తామని.. జాతీ య రాష్ట్ర జిల్లా మీడియాను తీసుకొచ్చి తా ము చేసిన పనులను చూయిస్తామన్నారు. పా దయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తు న్నామని నెల లోపల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించకపోతే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు.
మేము పాదయాత్ర చేస్తున్నామని ప్రకటించిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందని రెండున్నరేండ్లు ప్రభుత్వానికి సమయం ఇచ్చామని ఇక చేసేది లేక పాదయాత్ర ప్రకటనతో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రాజెక్టును విజిట్ చేశారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్ పూర్తిపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని తేటతెల్లమైందన్నారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. అదే మా ప్రభుత్వం ఉంటే ఆరునెలల్లో కరివెన వరకు నీళ్లు తీసుకొచ్చే వాళ్లమని చెప్పారు. అన్ని పనులు చేశాక మిగిలిన పనులు చేయడానికే ఇంకో ఏడాది అంటున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు 27 వేల ఎకరాలు భూసేకరణ చేశామని కావాలంటే లెక్కలు చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇంత పెద్ద ప్రాజెక్టుకు భూసేకరణ చేయకుండా ఎలా చేపడుతారని అనుకున్నారో అర్ధం కావడంలేదని, బీఆర్ఎస్ భూసేకరణ చేయలేదనడం హాస్యాస్పదనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాల్వలకు బీఆర్ఎస్ పిలిచిన టెండర్లను రద్దు చేశారని గుర్తుచేశారు.
కేసీఆర్ ఎంపీగా ఉండి జిల్లాకు ఏం చేయలేదనడం పచ్చి అబద్ధమని డబ్బు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరును వలసల జిల్లాగా పేరు తెచ్చారు.. మా జిల్లా ప్రాజెక్టులు అంటేనే పెండింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014కు ముందు జిల్లాకు 27వేల ఎకరాలకు సాగునీరు అందేది.. బీఆర్ఎస్ వచ్చాక ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాన్నారు. ఈ జిల్లాను బాగు చేయాలని కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరులోనే శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ నాయకులు దీనిపై అడ్డమైన కేసులు వేసి అడ్డుకున్నారని, అలాగే రైతులను భూము లు ఇవ్వొద్దని రెచ్చగొట్టారన్నాని విమర్శించారు.

అయినప్పటికీ అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ తొంభై శాతం పూర్తి చేశామన్నారు. వలసల జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇతర రాష్ర్టాల నుంచే ఇక్కడికి వలస వచ్చేలా చేశామని ఇది తొమ్మిదిన్నరేండ్లలో చూపించిన అద్భుతమని అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేండ్లలో ఏం చేయకుండా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంటున్నారని విమర్శించారు. ఉదండాపూర్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం, గ్రామస్తులను ఒప్పించి పనులు ప్రారంభించామని గుర్తుచేశారు. మూడు ప్యాకేజీలు కలిపి రూ.5,500కోట్లు అయితే నాలుగు వేల కోట్లు అప్పటికే రిలీజ్ చేసి ఖర్చు చేశామన్నారు. ఉద్దండాపూర్ రైతులకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని ఆలస్యంగా 2019లో పనులు ప్రారంభిస్తే రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందన్నారు. మరో రెండేళ్లలో రూ.5వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
రెండున్నరేండ్లలో కేవలం రూ.600 కోట్లు పరిహారం ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. మేము చేసిన పని ఏంటో జిల్లా మీడియాకు చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ రిజర్వాయర్లు కట్టింది.. అందుకే 90 టీఎంసీలు కాంగ్రెస్ అడు గుతుంది.. లేకపోతే అడగడానికి అవకాశం లేదన్నారు. మేము ఉద్య మ నాయకులం.. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం పని చేశామన్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అని ప్రగాల్భాలు పలికావు.. ఇప్పుడు.. ఏమైంది..? ఇప్పుడేమో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వనంటున్నావు.. ఇదంతా ప్రజలు చూసుకుంటారు.. ఎవరి జెండా ఎగరాలో? అని వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టి తీయలేదు.. పైగా కాంగ్రెస్ కేసులు వేయించింది.. అధికారంలోకి వచ్చాక పనులు పెండింగ్ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేసింది అందుకే రికార్డు స్థాయిలో పంట పండిదన్నారు. జడ్చర్లలో సభ పెడితే నియోజకవర్గానికి సీఎం ఏమైనా నిధులు ఇస్తారని ప్రజలంతా ఆశించారు.. కానీ జడ్చర్లకు, జిల్లాకు ఒరిగిందేమీ లేదు.. సభలో కేసీఆర్‌ను తిట్టడానికి సరిపోయింది. ఇందుకేనా సభ పెట్టిందని ప్రశ్నించారు.
మేం వచ్చాక వరి ఎక్కువ సాగైందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా సాగు ఎట్లా పెరిగిందో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయకట్టు పెరగకుండా పంట ఎక్కువ ఎట్లా వస్తుంది..? 2023 డిసెంబర్ నాటికి ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందగా సాగు ఎక్కువైంది…పంట ఎక్కువ పండిందన్నారు. రెండున్నరేండ్ల సమయాన్ని సీఎం వృథా చేశారని మండిపడ్డారు. పాదయాత్ర ప్రకటన చేశాకే జిల్లా పర్యటనకు వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తిట్టడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేయాలా? అని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డిపై ఉన్నత స్థాయి సమీక్ష చేశామని ప్రకటించారు, ఈ సమీక్షకు సంబంధించి ప్రెస్ నోట్ ఎందుకు విడుదల చేయలేదని, అంత రహస్యంగా సమీక్షించాల్సిన అవసరం ఏముందో ప్రజలకు వివరించాలన్నారు.
పనులు ఎక్కడి వరకు వచ్చాయి. ఏం చేయాలి అనే దానిపై స్పష్టత లేదన్నారు. అబద్ధపు పునాదులపై ఏర్పాటైన ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని మండిపడ్డారు. భూ సేకరణ చేయలేదని అంటున్నారు.. ఐదు రిజర్వాయర్ల కోసం 27వేల ఎకరాలు భూసేకరణ చేశామని గుర్తుచేశారు.

ఉమ్మడి జిల్లాలో14 స్థానాల్లో 12 గెలిపిస్తే జిల్లాకు ఒరిగింది ఏంటి? అని ప్రశ్నించారు. జూరాల సోర్స్‌తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీళ్లు ఎట్లా అందుతాయని నిలదీశారు. కానాయపల్లి ఆర్అండ్ఆర్ సమస్య ఏమైంది. ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లలేదు..జిల్లాకు వచ్చినం.. పోయినం కాదు…మొక్కుబడి సమీక్షలు కాదు..పనులు జరగాలన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి పాలమూరు పూర్తి చేయాలన్నారు.
ఇరవై వేల కోట్లు ఏడాదికి ఇస్తామన్నారు..రెండున్నరేండ్లు పూర్తయినా కనీసం రూ.20లైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి బీజేపీ జాతీయ హోదా ఇస్తామని మోసం చేసిందని , కే్ంర దం నుంచి నయా పైసా రాలేదు.. హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలను మో సం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు జిల్లా మీద ప్రేమ ఉంది కాబట్టే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారు.. కేసులు పెట్టి ఆపకపోతే మా హయాంలోనే మొత్తం పూర్తి చేసే వాళ్లం అని తేల్చి చెప్పారు. సీఎం ఇప్పటికైనా మేలుకోపోతే పాలమూరు ప్రజల ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, శ్రీనివాస్ యాదవ్, రాజేశ్వర్‌గౌడ్ , కొడుగల్ యాదయ్య, గంజి వెంకన్న, కేసీ నర్సింహులు, శివరాజ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
సీఎం రెండు రోజుల పర్యటనలో జిల్లాకు ఒరిగిందేమిలేదు.. ఏదైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని,కానీ సీఎం జిల్లా ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా స్పష్టంగా మీటింగ్‌లో చెప్పలేదన్నారు. జూరాల పరిధిలో కర్ణాటక చెక్ డ్యామ్ కట్టేందుకు ఏరియాల్ సర్వే రేవంత్‌రెడ్డి చేయడం హాస్యాస్పదం అన్నారు. కర్ణాటక వైపు వెళ్లిండు..
అక్కడ పనులు.. చెక్ డ్యామ్‌లు చూసిండు.. దానితో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. ఆదిత్యనాథ్ అనే అధికారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నీళ్లు తీసుకెళ్లేందుకు కుట్ర చేస్తున్నారని, కాల్వలు. టన్నెలు, మోటర్లు, పంపు హౌస్, రిజర్వాయర్లు కట్టింది కేసీఆర్ ప్రభుతమేనని, వాటిలో కనీసం తట్టెడు మట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్త లేదన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌లో రూ. 33,500కోట్లతో మా ప్రభుత్వం పని చేస్తే, పెండింగ్ బిల్లులు కొన్ని ఇచ్చి మేమే పని చేశామని అనడం సరి కాదన్నారు.

ప్రాజెక్ట్ జాప్యం కావడానికి కాంగ్రెస్ నాయకులు కారణం కదా.. కేసులు వేయించలేదా? అన్నిటిని దాటుకుని న్యాయపరమైన చిక్కులు ఉన్నా ప్రాజెక్ట్‌ను చివరిదశకు కేసీఆర్ తీసుకువచ్చారని గుర్తుచేశారు. ప్రతి ఏడాది రూ.20వేల కోట్లు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఇస్తామని రేవంత్‌రెడ్డి మాటతప్పారని విమర్శించారు, ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్తామని చెప్పగానే రెండున్నరేండ్లకు ప్రాజెక్ట్ గుర్తొచ్చి ఇప్పుడు వాటిని సందర్శించాడని, ఇప్పుడు కూడా వాటిని ఎప్పటి వరకు పూర్తి చేస్తారో కూడా చెప్పలేదన్నారు.
కాంగ్రెస్‌పై ఉద్యోగాల విషయంలో యువత, వడ్లు, యూరియా విషయంలో రైతులు, పింఛన్ల పెంపు విషయంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఏ సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా లేరని, ప్రజలే బీఆర్ఎస్ను గెలిపించుకుంటారని, తెలంగాణలో బీఆర్ఎస్ జెండా బరాబర్‌గా ఎగురుతదని ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేసి ఇప్పటికే మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వారే కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు పాలమూరు ప్రాజెక్ట్‌లో ఏం పనులు చేసారో ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్‌ని తిట్టడం తప్పా సీఎం రేవంత్‌రెడ్డికి అభివృద్ధి, సంక్షేమంపై ఆలోచన చేయడం లేదన్నారు. మేము ప్రారంభించి ఆగిపోయిన పనులపై సమీక్షా చేసి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.