అచ్చంపేట రూరల్ : ఎస్సీ వర్గీకరణను (SC Reservations) వాయిదా వేయడానికి రేవంత్ ( Revanth reddy) సర్కారు కుట్ర చేస్తుందని ఎమ్మార్పీఎస్ (MRPS) తాలూకా ఇన్చార్జి జిలకర సాంబశివుడు ఆరోపించారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ లో ఆమోదించి అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌట కాశీమ్, బుక్కాపురం మహేష్, కొయ్యాల వెంకటయ్య, ఏడేళ్లి ఆంజనేయులు, బార్పటి రాజు, ఎలిమిలేటి శంకర్ మాదిగ, పుల్లగుర్ల వెంకటయ్య, ఆలేటి బాలరాజు, కొయ్యల రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు రొడ్డ గణేష్, బొల్లె నాగరాజు, గాళీముడి రాము, పానుగంటి కరుణాకర్, దేవ పాల్గొన్నారు.