అచ్చంపేట, మార్చి 11 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో టీబీఎం మీషన్ ముందు భాగంలో 20మీటర్లు అత్యం త ప్రమాదకరంగా మారడంతో అక్కడ రెస్క్యూ బృందాలు వెళ్లే అవకాశం లేదు. అక్కడ రోబోలను దింపి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏ-1 బెస్ట్ కెమెరా సదుపాయం గల హైదరాబాద్‌లోని అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు విజయ్, అక్షయ్ లోకో ట్రైన్లో సొరంగంలోకి వెళ్లారు. ఆఫీసులో కమ్యూనికేషన్ వ్య వస్థ ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా రోబోల సహాయక చర్యలు ఉపయోగించుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి మూడు రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఆపరేట్ చేసేందుకు మాస్టర్ రోబో కీలకంగా మారనున్నది. మూడు రోబోలను నేడు టన్నెల్లోకి పంపించనున్నా రు. మాస్టర్ రోబో ద్వారా ఈ మూడు రోబోలు ఆటోమెటిక్‌గా పనిచేసే విధంగా టన్నెల్ బయట కార్యాలయంలో కమ్యూనికేషన్ సెటప్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఈరోజు రాత్రి వరకు టన్నెల్‌కు 3 రోబోలు చేరుకుంటాయి. ఒ క రోబో మట్టి, బురద, తొ లగించడం, ఇంకో రోబో నీళ్లను తొ లగించడం, మరో రోబో రాళ్లను తొలగించి చూర్ణంగా మా ర్చడం తదితర పనులు చేపట్టనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
18వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారికోసం 18రోజులుగా 14 సంస్థల బృందా లు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏడుగురి మృ తదేహాల కోసం అన్వేషణ కొ నసాగుతున్నది. ఉదయం అ న్వీ రోబో నిపుణుల బృం దంతోపాటు 110 మంది స హాయక బృందం లోపలికి వె ళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో మాస్టర్ రో బోను తీసుకువచ్చారు. టీబీఎం ముందుభాగంలో 20మీటర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొనడంతో అక్కడికి రెస్క్యూ బృందాలు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. సింగరేణి లో ఉపయోగించే దుంగలను టన్నెల్లో ఏర్పాటు చేశారు. దుంగలు అమర్చుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నా రు. అక్కడ పైభాగంలో సెగ్మెంట్లు డ్యామేజ్ అయ్యి ఉండడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టే క్ర మంలో కూలిపడే అవకాశం ఉందని అంటున్నారు. కేరళ క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ ర్యాడర్ గుర్తించిన డీ-1, డీ-2 ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతు న్నారు. డీ-2 ప్రదేశంలో రాబిన్ కంపెనీ ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహం బయటపడడంతో అట్టి ప్రదేశంలో మిగిలిన వారిలో ఎవరివైనా మృతదేహా లు ఉండే అవకాశం ఉందని తవ్వకాలు జరుపుతున్నా ఆచూకీ లభించడం లేదు.
ఎప్పటికప్పుడు అధికారుల సమీక్షలు
రాష్ట్ర, కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థలు, ఎన్జీఆర్ఐ, డాగ్
స్కాడ్ బృందాలు ప్రమాద ఘటనలో జాడ తెలియకుండా పోయిన మిగిలిన కార్మికులు, ఇంజినీర్ల కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గై క్వాడ్ రఘునాథ్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో రోబోలను వినియోగించాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించినట్లు వివరించారు. ప్ర మాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణన ష్టం సంభవించకుండా రోబోల సహాయక చర్యలు ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.