మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దోమలపెంట, ఫిబ్రవరి 26 : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బుధవారం తెల్లవారు జామున, సాయంత్రం రెండుసార్లు వెళ్లిన బృందాలు లోపల ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎట్టకేలకు చేరుకున్నాయి. సహాయక చర్యలు పర్యవేక్షించే బృందాలకు అక్కడి దృశ్యాలు షాకింగ్‌గా మారాయి. సొరంగం మొత్తం మూసుకోకపోవడంతోపాటు 15 ఫీట్ల ఎత్తు బురద పేరుకుపోయింది.
ఇక్కడే టీబీఎం మిషన్ ముందు భాగం ఉంటుందని భావిస్తున్నారు. ఇది దాటితే కానీ చిక్కుకున్న వారి ప్రదేశానికి చేరుకునే అవకాశం ఉందని నిర్ధారించారు. దేశంలోని అత్యుత్తమమైన నిపుణులను రప్పించారు. మంత్రులు, ఉన్నతాధికారులు వారితో సంప్రదింపులు జరుగుతున్నా.. సహాయక చర్యలు ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారి బంధువులు మూడ్రోజుల నుంచి దోమలపెంటలో పడిగాపులు కాస్తున్న పట్టించుకునే వారే లేరు. ప్రమాదంలో సహాయక చర్యలు మందగించాయని.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం ఘటనా ప్రాంతానికి రానున్నారు. ఈ బృందం వస్తున్న విషయం తెలుసుకున్న మంత్రులు రెండ్రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మీడియా ముందు ప్రకటించారు.
40 మీటర్లు కాదు 200 మీటర్లు
దోమలపెంట సొరంగం ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మీ టర్ల మేర బు రద నీరు కూరుకుపోయిందని భావిస్తే తాజాగా అది 200 మీటర్లకుపైగా వ్యాపించిందని నిర్ధారించా రు. గత 24 గంటల్లో మూడుసార్లు సొరంగంలోకి వెళ్లి వచ్చిన వివిధ బృం దాలు ఇచ్చిన నివేదిక ప్రకారం సొ రంగం పైకప్పు టీబీఎం మిషన్ ముందు భాగం మొ త్తం కూరుకుపోయిందని.. ఫలితంగా మిషన్ ముం దు దాదాపు 200 మీటర్ల వరకు బురద నిండిపోయిందని అంచనాకు వచ్చారు. టీబీఎం మెషిన్ ముందు స్వరంగ భాగంలో 15 ఫీట్ల ఎత్తు బురద చేరింది. ఈ బురద తొలగించాలంటే మిషన్‌ను గ్యా స్ కట్టర్లతో కట్ చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సొరంగ ప్రమాదంపై కారణాలు విశ్లేషించేందుకు నేషనల్ జియోలాజికల్ సర్వే నిపుణులు ఇ క్కడి మట్టిని, రాళ్ల ను పరిశీలిస్తున్నా రు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.
టీబీఎం మిషన్ కట్ చేయాల్సిం దే..
సొరంగం తవ్వకానికి ఉపయోగించే టీబీఎం మిషన్‌ను కట్ చే యాలని ఉన్నత స్థాయి స మావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కంపెనీ ప్రతినిధులతో పా టు వివిధ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించే నిపుణులు పాల్గొన్నారు. సొరంగంలో ముందుకు వెళ్లాలంటే అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ కట్టర్లతో కట్ చేయాలని.. అప్పుడే అక్కడ పేరుకుపోయిన బురదను తొలగించే అవకాశం ఉన్నదని, దీనికోసం కావాల్సిన ప్లాస్మా కట్టర్లతో కట్ చేయాలని మంత్రు లు ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ రెండ్రోజుల్లో ముగిస్తామని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఎస్ఎల్బీసీకి హరీశ్‌రావు బృందం
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం దోమలపెంటకు చేరుకోనున్నది. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ బృందం కల్వకుర్తి మీదుగా అచ్చంపేట నియోజకవర్గం హాజీపూర్ కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారని అ చ్చంపేట మాజీ ఎమ్మెల్యే, ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజ్ తెలిపారు. అక్కడి నుంచి హరీశ్‌రావు నేరుగా దోమలపెంటకు చేరుకొని.. ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత సొరంగంలో చిక్కుకున్న కార్మికుల బంధువులను పరామర్శిస్తారని వెల్లడించారు. అక్కడే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతారని తెలిపారు.