వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి జీపీ బుగ్గ కాలువ తండాకు (Bugga Kalva Thanda) బీటీ రోడ్డును ( BT Road ) మంజూరు చేయాలని కాంగ్రెస్ యువ నాయకుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్ ( Srinivas Yadav ) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి శనివారం వినతి పత్రాన్ని అందజేశారు.
చెదురుపల్లి నుంచి బుగ్గ కాలువ తండాకు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉందని,ఈ రహదారి నుంచి ఎర్రవెల్లి, గోకారం మీదుగా చారగొండ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారన్నారు. ప్రతి నెల రేషన్ బియ్యం కోసం బుగ్గ కాల్వ తండా నుంచి చెదురుపల్లి గ్రామానికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మట్టి రోడ్డు, గుంతలతో ఉండడంతో వాహనాలు రాకపోకలకు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని విన్నవించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చెదురుపల్లి నుంచి బుగ్గ కాలువ తండా వరకు బీటి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.