వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి డబుల్ లైన్ల రహదారిని (Double lane road ) నిర్మించాలని గ్రామానికి చెందిన యువ నాయకులు వసంతపు రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ( MLA Narayana Reddy ) హైదరాబాదు నివాసంలో బుధవారం కలిశారు. కొ ట్ర రహదారి అధ్వానంగా మారిందని డబుల్ లైన్ల రహదారి నిర్మించాలని కోరారు. కొ ట్ర నుంచి బుడోన్ పల్లి ,పోతేపల్లి మీదుగా దాదాపు 10 గ్రామాలకు ఈ రహదారి అనువుగా ఉంటుందని సూచించారు. రహదారి గుంతలుగా మారి రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు రాజు వివరించారు.