Praja Vani | కొత్త కాలనీ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి
Praja Vani | మాగనూరు మండల కేంద్రంలోని కొత్త కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వినతిపత్రం సమర్పించారు.
మాగనూరు: మాగనూరు మండల కేంద్రంలోని కొత్త కాలనీ ( New colony ) లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (Praja Vani ) లో వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని కాలనీ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు.
1988లో అప్పటి ప్రభుత్వం 200కు పైగా కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించిందని ,అప్పటి నుంచి నేటి వరకు కాలనీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో విషపురుగులు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. గతంలో పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన కూడా చోటుచేసుకుందని వారు పేర్కొన్నారు. కాలనీలో విద్యుత్ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పుంజనూర్ ఆంజనేయులు, పాటిమీది వెంకటయ్య, టప్ప రమేష్, లంగటి శేఖర్, పుంజనూర్ మహదేవ్, ఆంజనేయులు, మారెప్ప రాజు, వాబయ్య తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

