చారకొండ, మా ర్చి 21: నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకంలో కాలువలో కోల్పోయిన భూములకు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న తమకే పరిహారం చెల్లించి ఆదుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో శ్రీనును రైతులు కోరా రు. శుక్రవారం కమాల్పూర్లో భూ పరిహారంపై గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని కమార్పూర్లో సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామికి ఆలయానికి చెందిన 51.32 ఎకరాలు కాల్వ నిర్మాణంలో కోల్పోతున్నాయి.
ఎకరాలకు రూ. 5.30లక్షలు చొప్పు న ప్రభుత్వం పరిహారం మం జూరు చేసింది. దేవాలయంపైనే పట్టా ఉందని, తమకే పరిహా రం చెల్లించాలని ఆలయ అధికారులు పట్టుపట్టారు. తాము 1954 నుంచి తామే సాగు చేస్తున్నామని తమకు పరిహారం ఇ వ్వాలని రైతులు అధికారులకు కోరారు.
దీంతో రైతులు ఎన్ని ఏళ్ల నుండి సాగు చేస్తున్నారు.. ఎంత సాగు చేస్తున్నారో అనే వివరాలను తాసీల్దార్కు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో రైతులకు సూచించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తాసీల్దార్ సునీ త, దేవాదాయ శాఖ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, దేవాదాయ తాసీల్దార్ గిరిధర్, ఆలయ చైర్మన్ రామశర్మ, ఈవో ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, డీఎల్ఐ ఏఈ సుభాషిణి, ఆర్ఐ భరత్, మాజీ జెడ్పీటీసీ భీముడునాయక్, నర్సింహారెడ్డి, లక్ష్మణ్శర్మ, రైతులు పాల్గొన్నారు.