మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 8 : చౌ కధర దుకాణాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓ సంఘం నా యకుడి దుకాణానికి అధికారులు సీల్ వేయడం పా లమూరులో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంపై అధికారులు సమగ్ర వివరాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాడు లు చేసి తనిఖీలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సైతం ‘మాకేం తెలియదు.. వచ్చాం.. వెళ్లాం’ అంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. అం టూ దాటవేత ధోరణిలో వ్యవహరించారు. ఉమ్మడి పాలమూరులో చౌకధర దుకాణాలకు సరఫరా చే స్తున్న బియ్యం పలుచోట్ల అక్రమరవాణా చేస్తూ ప ట్టుబడుతుండడం విశేషం.
ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల నేపథ్యం లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో కొందరు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక వైపు అధికారులు చౌక దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. మరోవైపు డీలర్లు దుకాణాలు మూసి అజ్ఞాతంలోకి జారుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ప్రత్యేక బృందాలుగా చౌక దుకాణాలను తని ఖీ చేశాయి. తనిఖీల సమాచారం తెలుసుకున్న డీల ర్లు కొందరు సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకున్నారు.
కొందరు అందుబాటులోకి రాగా మరికొందరు ఎం తసేపటికీ అందుబాటులోకి రాలేదు. డీలర్లు, సి బ్బంది పిలిచినా రాకపోవటంతో అధికారులు చేసేదేమీ లేక దుకాణాలు సీల్ వేసి వెనుదిరిగారు. మ హబూబ్‌నగర్ పట్టణంలోని చౌకధర దుకాణం నెంబర్లు 53, 9కి అధికారులు సీల్ వేశారు. ఈ విషయంపై మహబూబ్‌నగర్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ను సంప్రదించగా.. దుకాణాల తనిఖీ సమయంలో డీలర్లు సకాలంలో రాకపోవడంతో సీల్ వేశామని తెలిపా రు. నిర్దేశిత సమయంలోనే తాము వెళ్లామని, అధికారులు వచ్చిన సమయంలో లేకపోవడం, పిలిచినా రాకపోవడంతోనే డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నామన్నారు. ఈ నెల 9న మరోసారి సందర్శించి సమగ్ర వివరాలు, దస్ర్తా లు పరిశీలిస్తామని పేర్కొన్నారు.