ఊట్కూర్/ మక్తల్/ధన్వాడ : ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగను మహబూబ్నగర్ జిల్లాలో ముస్లిం సోదరులు (Ramzan celebrations) భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని ఊట్కూర్(Utkoor), మక్తల్( Maktal), ధన్వాడ( Dhanwada) మండలాల్లో జరిగిన వేడుకల్లో ముస్లిం సోదరులు ఈద్గాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి కొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్( Eid Mubarak) తెలుపుకున్నారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు.
ఈ ఏడాది సైతం ఆ అల్లా చల్లని దీవెనలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన వారు అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. పీఏసీసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు సూర్య ప్రకాష్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ ఎంపీపీ లక్ష్మి, నాయకులు నారాయణరెడ్డి, జనార్దన్ రెడ్డి, మోహన్ రెడ్డి, దుర్గం శ్రీనివాసులు, యజ్ఞేశ్వర రెడ్డి, శివ రామరాజు, లింగం, యజ్ఞ దత్తు తదితరులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్ : మక్తల్ (Maktal) ఈద్గా వద్ద మైనార్టీ సోదరులకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy) రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం సోదరులు, తదితరులు ఉన్నారు.
ధన్వాడలో..
మండల కేంద్రమైన ధన్వాడతో ( Dhanwada) పాటు కిష్టాపూర్, కొండాపూర్, గోటుర్ గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. మైనారిటీలు పాతపల్లి ఈద్గా దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీల సంక్షేమ కృషి చేసిన నాయకులను సన్మానించారు. అనంతరం అఖిలపక్ష నాయకులు చేరుకొని మైనార్టీలకు ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు గంజిగొట్ ఖయ్యూం, నాయకులు బాలకృష్ణ, నరహరి, శివకుమార్, సత్యరెడ్డి, మల్లేష్ గౌడ్, కొండారెడ్డి, శాంతి కుమార్, రెహ్మాన్ ఖాన్, తాజుద్దీన్, డీలర్ బాబా ఇంతియాజుద్దీన్, రఫీ యుద్దీన్, ఇక్బాల్ ఖాన్, నూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.