రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించాలి
రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని, నిధులు ఉన్న ఎందుకు పనులు చేయడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ ఎర్రగట్టు తండాకు చెందిన నర్సింహ, నీలేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- లేదంటే ఆందోళనలు చేపడుతాం
- పరిపాలన చేతకాక మభ్యపెడుతున్న ప్రభుత్వం
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- బీఆర్ఎస్లో చేరిన కాశీంనగర్, ఎర్రగుట్టతండా కాంగ్రెస్ కార్యకర్తలు
వనపర్తి టౌన్, జూలై 14 : రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని, నిధులు ఉన్న ఎందుకు పనులు చేయడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ ఎర్రగట్టు తండాకు చెందిన నర్సింహ, నీలేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ వాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేశామని కానీ ఉన్న సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడం, రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణం నిర్లక్ష్యం చేయడంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వల్లే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాశీంనగర్ చుట్టూ పక్కల తండాలు సాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూసి కేసీఆర్‌ను ఒప్పించి అక్టోబర్ 3, 2023న రూ.50కోట్లు రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేతకాక సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, ధాన్యంపై బోనస్ ఎగ్గొట్టారని అన్నారు. కేసీఆర్ హయాంలో 11 విడుతలుగా రైతుబంధు రూ.72,815 కోట్లు రైతులకు చెల్లించామన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15వేలు ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతకు 2లక్షల ఉద్యోగాలు, ఆసరా పింఛన్లు రూ.4వేలు, తులం బంగారం, మహిళలకు రూ.2500 అని ఇ చ్చిన హామీలు అమలు చేయాలని డి మాండ్ చేశారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హ క్కు లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్‌నాయక్, ధర్మానాయక్, గోపాల్‌నాయక్, రవిప్రకాశ్‌రెడ్డి, మాధవరెడ్డి, నరేశ్, ఏర్వ సాయిప్రసాద్, మహేశ్వర్‌రెడ్డి, నర్సింహ, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, సక్రూనాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

