జడ్చర్లటౌన్, మార్చి 1 : ముస్లింలు అత్యంత నిష్టగా ఉపవాస దీక్షలు చేపట్టే పవి త్ర రంజాన్మాసం ప్రారం భమైంది. రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో విద్యుద్దీ పాలతో ముస్తాబు చేశారు. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపి ంచడంతో మసీదుల్లో సైరన్ మోగించి రంజాన్ మాసం ప్రారంభం సూచన చేశారు.
ఈ సందర్భంగా శనివారం రాత్రి నుంచి మసీదుల్లో ప్రత్యేక తారావి నమాజ్ ప్రార్థనలను ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాసదీక్షలు చేపట్టారు. నెలరోజులపాటు ముస్లింలు ఎంతో నిష్టతో ఉపవాసదీక్షల చేయటంతోపాటు పవిత్ర గ్రంథం ఖురాన్ పఠనం చేపడుతారు. అదే విధంగా మసీదుల్లో రాత్రిపూట తారావి నమాజు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.