దామరగిద్ద, ఫిబ్రవరి 2 : పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని విఠలాపురం గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త గుట్టలి గోపాల్ ఇటీవల మృతి చెందగా పార్టీ నుంచి రూ.2లక్షల బీమా చెక్కులను మాజీ ఎమ్మెల్యే అందజేశారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సుభాష్, మాజీ ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, నాయకులు క్యాసారం భీంరెడ్డి, పరశురాంరెడ్డి పాల్గొన్నారు.