నారాయణపేట, ఫిబ్రవరి 10 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేలో భాగంగా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని దామరగిద్దతండాలో గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దామరగిద్దతండాకు చెందిన గిరిజన రైతులు మాజీ ఎమ్మెల్యేను కలిసి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్దతండాలో గిరిజనుల భూమిలో పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడుతామని చెబుతున్నారని, వేరే ప్రాంతంలో భూ సేకరణ చేయాలని చెబుతున్నా వినకుండా భయపెట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు.