నారాయణపేట, నవంబర్ 30 : ప్రజల తిరుగుబాటు, బీఆర్ఎస్ పోరాటంతోనే లగచర్లలో విజయం సొంతమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లతండా, దుద్యా ల, పోలేపల్లి, హకీమ్పేటలో 3వేల ఎకరాల్లో సీఎం రే వంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు, గిరిజనుల తిరుగుబాటుతోపాటు బీఆర్ఎస్ పోరాటంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ఫార్మా కంపెనీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు.
రైతుల తరఫున కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి జైలుకు వెళ్లడంతో రోజురోజుకు ఆందోళన మ రింత ఉధృతమవుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం దిగివ చ్చి లగచర్లలో భూముల సేకరణకు వెనక్కి తగ్గిందన్నారు. ఫార్మా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెబుతుందని, రైతులకు అన్యాయం కాకుండా ప్రజలకు కలుషిత వాతావరణం కలుగకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందంటే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటును బీఆర్ఎస్ స్వాగతిస్తుందన్నారు. రైతుల తరఫున పోరాటం చేసి జైలులో ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని, అమాయక ప్రజలపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డి మాండ్ చేశారు. ఆరు గ్రామాల ప్రజలను ఫార్మా పేరుతో ఏడాదిగా నిద్రాహారాలు లేకుండా చేసిన సీఎం రేవంత్రెడ్డి ముందుగా సొంత నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ పేట జిల్లా కార్యాలయంలో శుక్రవారం చేపట్టిన దీక్షాదివస్కు 13మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన గులాబీ సైనికులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన బైక్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడినా ఎంతో ఓర్పుతో సహకరించిన పట్టణ ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు.