నారాయణపేట, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ స్థాపించి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు నారాయణపేట జిల్లా నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ సభకు వెళ్లేందుకు నాయకుల సొంత వాహనాలతోపాటు పార్టీ తరఫున, నియోజకవర్గ ఇన్చార్జీల తరఫున ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి 30 బస్సులు, 155 వాహనాలు వరంగల్ సభకు తరలి వెళ్లనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు గ్రామాల వారీగా జెండా దిమ్మెల ఏర్పాటు, వాల్‌రైటింగ్, పోస్టర్ల ఏర్పాటు గురించి పార్టీ మండలాల అధ్యక్షులను అడిగి తెలుసుకున్నారు.
27న ఉదయం 6గంటలకు అన్ని గ్రామాలు, వార్డుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసిన అనంతరం సభకు తరలిరావాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండలాల అధ్యక్షులు కృష్ణయ్య, విజయ్‌సాగర్, రాములు, సుభాష్, వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భీమయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్యయాదవ్, భీంరెడ్డి, చెన్నారెడ్డి, కన్న జగదీశ్, కృష్ణారెడ్డి, రవికుమార్, సుదీప్‌కుమార్, సునీల్, గండి రాజు, హన్మంతు, వెంకట్రాములు, సురేందర్‌రెడ్డి, శ్రీధర్, బోయ గోపి హాజరయ్యారు.