పాలమూరులో భారీ వర్షం
జ డ్చర్ల పట్టణంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వరకాలనీ, శివాజీనగర్, రాజీవ్‌నగర్, బొవెలకుంట ప్రాంతాల్లోకి నీరు భారీగా చేరింది.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వానలు
- జడ్చర్లలో జలమయమైన రోడ్లు.. తడిసిన ధాన్యం
- ఆలూర్ రైల్వే అండర్‌పాస్ వద్ద నిలిచిన వర్షపు నీరు
- ఉండవెల్లి, తిమ్మాజిపేటలో నేలకొరిగిన చెట్లు
- ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు
- ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
- గన్యాగులలో పిడుగుపాటుకు ఆరు గొర్రెలు, 2 పొట్టేళ్లు మృతి
జడ్చర్ల టౌన్/ఉండవెల్లి/తిమ్మాజిపేట/ అచ్చంపేట టౌన్/నాగర్‌కర్నూల్, మే 20 : జ డ్చర్ల పట్టణంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వరకాలనీ, శివాజీనగర్, రాజీవ్‌నగర్, బొవెలకుంట ప్రాంతాల్లోకి నీరు భారీగా చేరింది. మార్కెట్‌యార్డులోని ధాన్యం బస్తాలు తడిసిపోగా.. కొ నుగోలు చేసిన ధాన్యం బస్తాలు లారీల్లోకి ఎక్కిస్తుండగా తడిసినట్లు వ్యాపారులు తెలిపారు. జడ్చర్ల ఫ్లై ఓవర్, పట్టణ ప్రధాన రహదారిపై, ఆలూర్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగా యి. రైల్వే అండర్‌పాస్‌లో వర్షపు నీరు నిలవకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోడుగల్, ఆ లూర్, గంగాపూర్, మాచారం, బూరెడ్డిపల్లి, మల్లెబోయిన్పల్లి గ్రామాల్లో ఈదురుగాలుల తో వీస్తుండటంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉండవెల్లి మండలం బొంకూరులో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎగువన కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
తిమ్మాజిపేట నుంచి జడ్చర్ల-నాగర్‌కర్నూల్ వెళ్లే దారిలో ఇంద్రానగర్, తం డా సమీపంలో చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎస్సై నరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని జేసీబీల సాయంతో చె ట్లను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అచ్చంపేట బస్టాండ్‌లో నిలిచిన వ ర్షపు నీటిని సిబ్బంది తోడివేశారు. నాగర్‌కర్నూల్ మండలంలో ఉరుములు, మెరుపుల తో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈక్రమంలో గన్యాగులలో పిడుగుపాటుకు గురై వెంకటయ్యకు చెందిన ఆరు గొర్రెలు, రెండు పొట్టేళ్లు మృతి చెందాయి. కండ్లముందే జీవా లు చనిపోవడంతో యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింద ని, బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రా మస్తులు కోరారు. ఇదిలా ఉండగా, వర్షాలు స మృద్ధిగా కురుస్తుండడంతో దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు పొలాలను సి ద్ధం చేసుకుంటున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

