మక్తల్/ఊట్కూర్/గట్టు, ఆగస్టు 7 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వ ర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల దంచికొట్ట గా.. కొన్ని చోట్ల ముసురుతో ముంచెత్తింది. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వాన కురిసింది. గట్టులో అత్యధికంగా 12.2 సెం.మీ., మానవపాడు మండలంలో 43.2 మి.మీ., అయిజ మండలంలో 65.5 మి. మీ., ఊట్కూరు మండలంలో 71.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గొర్లఖాన్‌దొడ్డి-గట్టు మధ్యలో ఉన్న 105 ప్యాకేజీ, భీ మా డీ-1 కాల్వలకు గండ్లు పడ్డాయి. ఈ నీరంతా సమీప పంట పొలాలను ముంచెత్తాయి. మక్తల్ స మీపంలోని భీమా కెనాల్ కోతకు గురై వందలాది ఎకరాల్లోకి నీరు చేరింది. పంట పొలాలన్నీ వరదలో జలమయమయ్యాయి. పలు చోట్ల వాగులు ఉధృతంగా పారాయి.
చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. కర్ణాటక ఎగువ ప్రాంతం నుంచి వరద చేరడంతో అమీన్పూర్, ఓబ్లాపూర్, పడిగిమర్రి, పాతపల్లి, మల్లేపల్లి గ్రామాల్లోని పెద్ద వాగులు పరవళ్లు తొక్కాయి. బిజ్వారం, అవుసలోనిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును నిలిపివేశారు. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. డీ-1 కాల్వ కోతకు గురి కాగా వందలాది ఎకరాలు జలమయమయ్యాయి.
సంగంబండ పెద్దవాగుపై భీమా ఫేజ్-1లో 3.317 టీఎంసీలతో నిర్మించిన రిజర్వాయర్ గేట్లు తెరిచా రు. ఈ రిజర్వాయర్‌కు లెఫ్ట్ హైలెవెల్ మెయిన్ కె నాల్ పరిధిలోని డీ-1 కాల్వకు గండి పడింది. మ క్తల్కు నీటిని పారించే కాల్వ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో నీళ్లంతా వృథాగా పోతున్నాయని రైతులు ఆరోపించారు. పలు చోట్ల మట్టి మిద్దెలు కూలాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి.