వనపర్తి, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్టంలో పోక్సో చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం పొగ పెడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. మైనర్ బాలికపై అనేక దఫాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత కూడా నిందితుడికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటూ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. అందు నా తండ్రి బండి సంజయ్ ఉన్నప్పటికి సాయి భగీరథ్ మేనమామకు నోటీసు ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలనడం అ త్యంత దుర్మార్గమన్నారు. బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ మహిళా నాయకుల సమక్షంలో వనపర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ తెలంగాణలో మైనర్ బాలికపై జ రిగిన అఘాయి త్యం దేశంలోని మహిళలందరిని అతలాకుత లం చేస్తుందన్నారు. ఈ పోక్సో కేసులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు ఒళ్లు గగు రు పొడిచే విషయాలున్నాయ ని, తాము ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చెబుతున్న మాటలు కావని, దుష్ప్రచారం చేయడానికో ఈ సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి, ప్రజలకు వాస్తవాలను తెలియపరిచి కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ చేసిన అఘాయిత్యం వివరాలను వెల్లడిస్తున్నామన్నారు.
ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాలిక తల్లి అఘాయిత్యంపై ఫిర్యాదు చేసిందన్నారు. అయినా ఇప్పటివరకు ఆకేసులో ఎలాంటి పురోగతి లేదని, అయితే, రాష్ట్రంలో సీఎం, హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి కొనసాగుతున్న విషయం ప్రజలు గమనించాల్సి ఉందన్నారు. ఇటు కేంద్ర మంత్రిగా బండి సంజ య్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోనే పోలీస్ వ్యవస్థ యావత్తు పనిచేస్తుందని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. దుర్మార్గమైన ఘటనపై బీఆర్ఎస్తోపాటు పలు ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగా ఈకేసు అనువంత పురోగతి సాధించిందన్నారు.
బాలికకు ఎలా అన్యా యం జరుగుతుంది.. నేరం చేసిన నిందితుడికి ప్రభుత్వ యంత్రాం గం ఎలా వంత పాడుతుందో ప్రజలు గమనించాలన్నారు. 2012లో వచ్చిన పోక్సో చట్టం అత్యంత కఠినంగా ఉందని, అయితే, ఈ చట్టం రాష్ట్రంలో అధికారం లో ఉన్న వారికి చుట్టంగా మారిపోయిందన్నారు. అయితే బండి సా యి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి..పేట్ బషీరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ భగీరథ్ మేనమామ సీహెచ్ వంశీకృష్ణ అనే వ్యక్తికి ఓ నోటీసు ఇచ్చారన్నారు.
ఈ నోటీసులో అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఇందుకు కేసులో సెక్షన్లను అల్ట ర్ చేయబడ్డాయని 5, 6 సెక్షన్లను పెట్టామని చెబుతూ సాయి భగీరథ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని కోరారన్నారు. లైంగిక దాడులకు పాల్పడ్డ వ్యక్తులకు ఏచట్ట ప్రకారం నోటీసులు ఇచ్చారని, అందునా మేనమామకు నోటీసు ఇవ్వడం ఎలా సమంజసమని డీజీపీని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి తండ్రిని వదిలి మేనమామకు ఎందుకు నోటీసు ఇచ్చారో తెలంగాణ సమాజానికి డీజీపీ సమాధానం చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ఇటీవల హనుమాన్ జయంతిలో తనకు అడ్డువచ్చిన వారి సంగతి చూస్తానంటూ బహిరంగంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ హెచ్చరికలతో ప్రసంగాలు చేస్తుంటే అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నదన్నారు. సనాతన దర్మం పేరుతో సాయి భగీరథ్ మహిళలను చెరబడుతుంటే కాపాడేందుకు తండ్రి బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నాడని, సాయి భగీరథ్ విదేశాలకు పారిపోయాడా లేదా అన్నది పోలీసులు తేల్చాలన్నారు. తప్పు చేసిన ఘటనలో కేంద్ర మంత్రి ఇళ్లును ఎందుకు రైడ్ చేయడం లేదన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ మైనర్ బాలిక లైంగిక దాడి ఘటనను ఖండించాలని, గతంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ తప్పు చేస్తే గతంలో కేసీఆర్ అతనిని పదవి నుంచి తప్పించారని ప్రవీణ్‌కుమార్ గుర్తు చేశారు. మీడియాను సంజయ్ గుప్పిట్లో పెట్టుకొని కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని, డీజీపీ, సీపీ హైదరాబాద్, సీపీ కరీంనగర్ అధికారులు చట్టాన్ని కాపాడాలని ప్రవీణ్ కుమార్ కోరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందని, ఆర్ఎస్ఎస్, బీజేపీలు న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. నిజం వైపు న్యాయవ్యవస్థ నిలబడాలని, అంబేద్కర్ రాజ్యంగాన్ని అమలు చేయాలని ప్రవీణ్‌కుమార్ కోరారు.
ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో వేసే కుట్ర : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేసే కుట్ర లు జరుగుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థను బలహీన పరచడంతో సమా జం యావత్తు బలహీనపడుతుందని సింగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉంటే చట్ట వ్యతిరేక పనులు యథేచ్ఛగా చేయవచ్చన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రధానంగా న్యాయ, పోలీస్ వ్యవస్థలు చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలన్నారు. దుర్మార్గమైన ఘటనలు జరిగినప్పుడు మీడియా సైతం ప్రధానపాత్ర పోషించాలని, అయితే, అ ద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుపైన, కేసీఆర్ ప్రభుత్వంపైన పనిగట్టుకుని ఓ మీడియా ప్రచారానికి పాల్పడిందని సింగిరెడ్డి గుర్తు చేశారు.
అదే మీడియా ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు అమలుచేయని వారి పక్షాన నిలబడి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనలోనూ ఆ మీడియా అదే తంతును ప్రదర్శిస్తూ నిందితులకు వంతపాడటం శోచనీయమన్నారు. నైతిక విలువలను కాపాడాల్సిన బా ధ్యత అన్ని సంస్థలతోపాటు ప్రతి పౌరుడిపై ఉందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, గట్టు యాదవ్, శ్రీధర్, కర్రెస్వామి, నీలస్వామి, అశోక్, హేమంత్, రాము, కరుణశ్రీ, స్వప్న, సౌ జన్య, అరుణ, శిరీష, శారద, కవిత, పవిత్ర, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.