నారాయణపేట, నవంబర్ 21 : కేసీఆర్ హయాంలో విద్యార్థుల భోజన పథకంలో ఎంతో నాణ్యత పాటిస్తూ వచ్చేవారు. చిన్నపాటి పొరపాట్లు కూడా రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చేవారు. కానీ కాం గ్రెస్ పదకొండు నెలల పాలనలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా వండివడ్డిస్తున్నారనే అపవాదును మూటకట్టుకుంది. అందుకు గత పదకొండు నెలల కాలంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు ఘటనలు ఒక నారాయణపేట జిల్లాలో వెలుగు చూశాయి.
అన్నం లో పురుగులు రావడం, ఉడికి ఉడకని అన్నం వడ్డించడం వంటి ఘ టనలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల్లోనే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైనంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వారు కోరుతున్నారు.
ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల చారుతో ప్రతినిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నామని నారాయణపేట జిల్లాలోని సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కోస్గి మండలంలోని నా చారం వద్ద ఉన్న కేజీబీవీ విద్యార్థినులు గత ఆగస్టు నెల 3వ రోడ్డెక్కారు. కేజీబీవీలో మెనూ పాటించడం లేదని, తమకు న్యాయం చే యాలని తాండూర్ – మహబూబ్నగర్ రోడ్డుపై విద్యార్థినులు బైఠాయించారు. కలెక్టర్ రావాలి, న్యాయం చేయాలి, కలుషిత ఆహారం వద్దు- పౌష్టికాహారం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ మూడు గం టల పాటు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూ స్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఇలా ఉంటే మిగతా మండలాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న అప్పట్లో తలెత్తింది.
కోస్గి ఘటన జరిగి మూడున్నర నెలలు కూడా కాలేదు.. తిరిగి మా గనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇలాంటి ఘ టనలు ఇటీవల రెండు సార్లు వెలుగు చూశాయి. పది నెలల కిందట కూడా ఇదే విధంగా అన్నంలో పురుగుల వచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే పాఠశాలలో ఈ ఏడాది సెప్టెంబర్ 11 ఉడకని అన్నం పెడుతున్నారని వండిన అన్నాన్ని విద్యార్థులు పార బోశారు.
విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం చూ స్తుంటే పురుగుల అన్నమే… ఆ పాఠశాలలో పరమా న్నం.. అన్న చందంగా మారింది. పురుగుల అన్నమే కాదు, ఏకంగా ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరునాడే వడ్డించిన మధ్యాహ్న భోజనంలోనూ పురుగులు రావడం గమనార్హం.
అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒక వైపు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతుండగా మరో వైపు గురువారం పాఠశాలకు హాజరైన విద్యార్థుల కో సం మధ్యాహ్న భోజనం అధికారులు దగ్గర ఉండి మరీ సిద్ధం చేశా రు. పాఠశాలలో మొత్తం 584 విద్యార్థులు ఉండగా గురువారం 334 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికోసం 50 కిలోల బి య్యం వండించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో వడ్డిస్తుండగా తిరిగి అన్నంలో పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థులు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పురుగులు వచ్చిన అన్నాన్ని పారబోశారు. తిరిగి మాజీ ఎమ్మె
ల్యే చిట్టెం, తాసీల్దార్ తెప్పించిన ఇచ్చిన బియ్యంతో తిరిగి వండించి సాయంత్రం 3:30 నుంచి 4 గంటల మధ్య భోజనం వడ్డించారు. ఏదీ ఏమైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు నాసిరకం భోజనం అందిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఈ ఏడాది జనవరిలో మక్తల్ జెడ్పీహెచ్ఎస్ లో కాలం చెల్లిన బియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డించారు. దీంతో విద్యార్థులు ఈ అన్నాన్ని మేం తినలేమని ఖాళీ కడుపుతో ఇంటిబాట పట్టిన ఘటన లో అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఎకువ శాతం జెడ్పీహెచ్ఎస్లకు గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుండడంతో పాఠశాలలో వంట ఏజెన్సీ వారు వండిన నాణ్యత లేని అన్నం తినలేక కడుపు మాడ్చుకొ ని వారి స్వగ్రామాలకు వెళ్లలేక పస్తులు ఉండి సాయం త్రం ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏదేమైనప్పటికీ పాఠశాలలో విద్యార్థులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉండగా అటు అధికారులు ఇటువంటి ఏజెన్సీ వాళ్ల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందడం లేదని ఆరోపణలు ఎకువగా ఉన్నాయి.