నాగర్‌కర్నూల్, ఆగస్టు 24 : బడి చిన్నారుల పాలిట గుడిలాంటిది. చదువుతోపాటు సంస్కారం నేర్పేందుకు తొలిగుడిలా భావిస్తాం. అలాంటి గుడిలో అన్ని సౌకర్యాలు సమపాలలో ఉంటేనే విద్య సమపార్జనలో సాధ్యమవుతుంది. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే స్థోమతలేని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభు త్వం గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేసింది. అప్పటి మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు చొరవతో పురుడుపోసుకున్న గురుకులాల వ్యవస్థను కొన్ని గురుకులాలతోనే కొనసాగాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గురుకులాల సంఖ్యను పెంచి అన్ని సౌకర్యాలు కల్పించి పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువునేందుకు వీలు కల్పించారు.
అలాంటి గురుకులాలు కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత భ్రష్టుపట్టి పోయాయి. సరైన భవనాలు లేవు, సౌకర్యాలు లేవు, కడుపు నిండా తిండిలేకపోగా పురుగుల అ న్నం తినలేక, నాణ్యతలేని భోజనం తిని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మెనూ ప్రకా రం భోజనాలను విద్యార్థులకు వండిపెట్టాల్సిన వం ట ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల వందలాదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నా రు. ఫుడ్‌పాయిజన్ ఘటనలతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నాగర్‌కర్నూ ల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోని ఎస్టీ, ఎస్టీ, బీ.సీ, మై నార్టీ గురుకులాల విద్యార్థులు అల్లాడిపోతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గురుకులాల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. అద్దె భవనాల్లో, శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థినీ, విద్యార్థులకు భయంగా గడుపుతున్నారు. అరకొర వసతుల మధ్య, నాణ్యతలేని భోజనం చేసి విద్యార్థులు సక్రమంగా చదువుకోలేని పరిస్థితులు దాపురించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల గురించి ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న ఘటనలు తలుచుకుంటేనే భయమేసేలా పాఠశాలలు దిగజారి తయారయ్యాయి.
ఇలా ఒకటికాదు రెండు కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లోనూ సమస్యల వలయంలోనూ కొట్టుమిట్టాడుతున్నాయి. వంట ఏజెన్సీలకు సక్రమంగా జీతాలు పెంచకపోవడం, ఉన్న జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో వారు వండిందే వంట చేసిందే కూరలు అన్నట్లుగా తయాయయ్యాయి. మెనూ ప్రకారం మూడు పూటలా అందించాల్సిన టిఫిన్, భోజనం, స్నాక్స్ వంటి వాటిలో నాణ్యత లోపించడం, ఉడికీ ఉడకని భోజనాన్ని చేసిపెడుతుండడంతో తరచూ ఫుడ్‌పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనూ దాదాపు వందలాది మంది విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్‌తో దవాఖానల పాలైన ఘటనలు జరుగుతున్నాయి.
గురుకులాలకు సరుకుల సరఫరా చేసేవారికి సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం, అద్దెలు చెల్లించకపోవడం, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమే గురుకులాలు భ్రష్టుపట్టాయనడానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్య తరగతికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా గురుకులాలు పట్టణాలకు విసిరేసినట్లుగా నిషిద్ధ ప్రాంతాల్లో ఉండడంతో ఏ సమస్య వచ్చినా బయటకు పొక్కడం లేదన్న ఆరోపణలు వున్నాయి.
కొన్ని పాఠశాలల గేట్లకు అనుమతిలేనిదే లోపలికి ప్రవేశం లేదని బోర్డులు పెట్టడం, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు సైతం గురుకులాలకు రానివ్వకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా సమచారం బయటకు చెబితే విద్యార్థులను టార్గెట్ చేస్తుండడంతో వారు ఏం జరిగితే చెప్పే పరిస్థితులో లేకపోవడంతో, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గురుకులాల్లో సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి.
కేంద్రీకృత సేకరణ విధానం అమలులో జాప్యం కారణంగా ఈ విద్యా సంవత్సరంలోనూ పాత కాం ట్రాక్టర్లనే కొనసాగించడం, వారికి కూడా సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిలో సరుకులను పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కాంట్రాక్టర్లకు కొన్ని చోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు సమయానికి బిల్లులు అందించకపోకపోతే సరుకుల సరఫరా సమయానికి అందించలేమని కాంట్రాక్టర్లు తేల్చేసి చెబుతున్నారు.
ఇప్పటికే చాలా గురుకులాల లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి సరుకులను సరఫరా చేయాల్సి వ స్తుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోతే స రుకులు సమయానికి అందించలేమని ఆవేదన వ్య క్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నాసిరకం సరుకులు, చాలా రోజులుగా నిల్వ ఉన్న కూరగాయాలు వండిపెట్టడం, పురుగుల అన్నం వండిపెట్టడం, నాసిరకం మాంసాన్ని పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన దవాఖానల పాలవుతున్నారు.
సరుకులు లేనిచోట ఉదయం మిగిలిన స్నాక్స్ సాయంత్రం పెట్టడం, మధ్యాహ్నం మిగిలిన అన్నం, కూరగాయలు రాత్రి పెట్టడం, పులిసిపోయిన పెరు గు, మజ్జి వంటివి విద్యార్థులకు పెడుతుండడంతో అస్వస్థలకు గురవ్వడం సర్వసాధారణమైంది. గురుకులాలకు సరఫరా అవుతున్న పాలు, పెరుగులో సైతం నాణ్యత లోపిస్తుండడంతో తరచూ విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గురుకులాలకు సం బంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యాన్ని వీడి పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.