కోయిలకొండ జనవరి 4 : బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు క్యూ కడుతున్నారు. మండలంలోని కోయిలకొండ, చందాపూర్, పారుపల్లి, మల్కాపూర్, మనికొండ, కొతలాబాద్, సురారం గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజీపీకి చెందిన 400 మంది ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బుధవారం శేరివెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోయిలకొండకు చెందిన మాజీ సర్పంచ్ రాజ్‌కుమార్, టీఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పానుగంటి నాగేశ్, బీఎస్పీ మండల అధ్యక్షుడు రమేశ్, ట్యాక్సీ యూనియన్ మండల అధ్యక్షుడు భరత్‌గౌడ్, పారుపల్లి సర్పంచ్ మాణిక్యమ్మాయాదయ్య, చందాపూర్ సర్పంచ్ కవితారాంచందర్, మాజీ సర్పంచ్ బాలస్వామి, మల్కాపూర్ శ్రీధర్‌రెడ్డి, మనికొండ ఆంజనేయులు, వీరంపల్లి ముదిరాజ్ అధ్యక్షుడు నారాయణ, కొతలాబాద్ మాజీ ఉపసర్పంచ్ బాబుయాదవ్తోపాటు 400మంది బీఆర్ఎస్ చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పేట బీఆర్ఎస్ సమన్వయకర్త ఎస్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.