Neymar : బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో కొత్త తరాన్నికి స్పూర్తిగా నిలిచిన నెయ్మర్ జూనియర్ (Neymar Junior) వీడ్కోలు పలికాడు. పీలే(Pele), రొనాల్డిన్హో(Ronaldinho) వంటి దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగించి, షో మ్యాన్‌గా ఓ వెలుగు వెలిగిన అతడు అనూహ్యంగా సాకర్‌కు బైబై చెప్పేశాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఫేవరెటైన తమ జట్టు 16వ రౌండ్లో ఓటమిపాల్వడం జీర్ణించుకోలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటగాడిగా నా ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసింది అని అతడు వెల్లడించాడు. తన ప్రాణానికి ప్రాణమైన ఆటకు నెయ్మర్ విచార వదనంతో అల్విదా చెప్పడం కోట్లాదిమందిని కలచివేసింది.
నెయ్మర్.. బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో ఈ పేరు ఓ సంచలనం. తండ్రి పేరు నెయ్మర్ డిసిల్వా శాంటోస్ కాగా.. అతడిని ముద్దుగా నెయ్మర్ జూనియర్ అని పిలిచేవారు. సాకర్‌ను ఎంతోగానే ప్రేమించే దక్షిణ ఆఫ్రికాకు చెందిన దేశంలో పసుపు, ఆకుపచ్చ రంగు జెర్సీతో మ్యాజిక్ చేశాడీ ఫార్వర్డ్ ప్లేయర్. 2010లో సీనియర్ జట్టుకు ఎంపికైన అతడు.. రొనాల్డిన్హో, గర్రించా వంటి దిగ్గజాల తరహాలో షో మ్యాన్‌లా అలరించాడు. అంతేనా.. అత్యధిక గోల్స్‌తో రికార్డు నెలకొల్పాడు.
Hoje o mundo se despede de Neymar Jr. o príncipe que nunca foi coroado Rei.
Infelizmente você nunca teve uma seleção que estivesse no seu nível.
Única coisa boa nisso é que finalmente você vai parar de ser o escudo dos jogadores FRACOS que sempre se esconderam atrás de você. pic.twitter.com/jAZcOKIDis
— Serafim (@Serafim_zx) July 6, 2026
Neymar really fooled the entire generation of footballers into thinking they can replicate his penalty technique pic.twitter.com/uTue9URdXp
— 🌪️ (@coldvinga) July 5, 2026
అంతర్జాతీయంగా 80 గోల్స్‌తో తొలి తరం ఆటగాళ్లు పీలే, రొనాల్డిన్హోలను దాటేశాడు. ఫుట్‌బాల్‌ను ఆట కంటే ఓ కళగా భావించిన అతడు.. సాంకేతికంగా ఎంతో బలవంతుడే కాదు వ్యూహాత్మకంగా ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. బ్రెజిల్ ఒలింపిక్ పతకం కలను సాకారం చేసిన ఘనుడు నెయ్మరే. అతడి సారథ్యంలోని అండర్- 23 జట్టు రియో గేమ్స్ 2016లో స్వర్ణం గెలుపొందింది. అథ్లెటిక్స్‌లో ఎన్నో మెడల్స్ వచ్చినా.. ఫుట్‌బాల్‌లో ఆ దేశానికి ఒలింపిక్స్‌లో పసిడి అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడీ ఫార్వర్డ్ ఆటగాడు.
Neymar says goodbye to the World Cup 😢 pic.twitter.com/8TGHOyIItt
— B/R Football (@brfootball) July 5, 2026
ప్రతిసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగే నెయ్మర్ కల కలగానే మిగిలింది. నాలుగుసార్లు ప్రపంచకప్ 2014, 2018, 2022, 2026లో ఆడిన అతడు జట్టును విజేతగా నిలపలేకపోయాడు. ఈసారి మెరిసి దేశానికి ఆరో కప్ అందించాలనుకున్నాడు. కానీ, 16వ రౌండ్లోనే ఓటమితో అతడి కల చెదిరింది. జూలై 5 ఆదివారం ఉత్కంఠ పోరులో నార్వే చేతిలో 2-1తో బ్రెజిల్ కంగుతినడాన్ని నమ్మలేకపోయిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ మైదానంలో వలవల ఏడ్చాడు. నీటి ఊటలా ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే చివరిసారిగా ఫుట్‌బాల్ అభిమానులకు అభివాదం చేశాడు. రెండు కాళ్లపై కూలబడి కన్నీటిపర్యంతమైన అతడిని సహచరులు ఓదార్చారు.
‘నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ, ఇక ముగిసింది. నా ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసింది’ అని నెయ్మర్ పేర్కొన్నాడు. కుడి కాలి పిక్క కండరాల నొప్పితో బాధ పడిన నెయ్మర్ ఈసారి రెండు మ్యాచులే ఆడాడు. స్కాట్లాండ్పై 15 నిమిషాలు మైదానంలో కనిపించిన అతడు.. నార్వేపై 67వ నిమిషంలో జట్టుతో కలిశాడు.