దోమలపెంట, డి సెంబర్ 8 : అమ్రాబా ద్ మండలం దోమలపెంట, ఈగలపెంట టీ జీ జెన్కో శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుం చి జలాశయంలోకి పంప్‌మోడ్ పద్ధతిలో నీటిని తరలిస్తున్నారు. వారం రోజులుగా ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ఎగ్జిట్ టన్నెల్ నుంచి 1, 2 యూనిట్ల ద్వారా పంప్‌మోడ్ పద్ధతిలో నీటిని మోటర్ల ద్వారా జలాశయంలోకి ఎత్త్తిపోయడం జరుగుతుంది. లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆదేశాల మేరకు విద్యుత్, ఆఫ్ పీక్ పిరియడ్‌లో పంపింగ్ చేయడం, పీక్ లోడ్ పీరియడ్‌లో విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం జరుగుతుంది.
పంపింగ్ చేసే సమయంలో ఒక్కో యూనిట్‌కు గంటకు 0.176 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని, ఒక్కో యూనిట్ ద్వారా పంప్‌మోడ్ పద్ధతిలో గంటకు 270 క్యూసెక్కులను మోటర్ల ద్వారా జలాశయంలోకి ఎత్తిపోస్తారు. రోజుకు 13 గంటల పాటు 2 యూనిట్ల ద్వారా జలాశయంలోకి పంప్‌మోడ్ పద్ధతిలో నీటిని పంపింగ్ చేయడం వల్ల 4.576 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఖర్చు కాగా 7,020 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు.
నాగర్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 540 అడుగులపైన ఉంటేనే పంపింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని, ప్రస్తుత నీటిమట్టం 584.90 అడుగుల ఉన్నందువలన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం 2 యూనిట్ల ద్వారా పంప్‌మోడ్ పద్ధతిలో నీటిని మోటర్ల ద్వారా జలాశయంలోకి ఎత్తిపోయనున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆదేశాల ప్రకారం శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్ల ద్వారా పంపింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. దీని ద్వారా ఆఫ్ పీక్ పిరియడ్‌లో నీటిని శ్రీశైలం జలాశయంలోకి పంప్ చేస్తారు. దీనివల్ల సాగు, తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా పీక్ లోడ్ పిరియడ్‌లో విద్యుదుత్ప త్తి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం రాష్ర్టానికే తలమానికమని చెప్పారు.