నవాబ్‌పేట, ఏప్రిల్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. స్వగ్రామమైన నవాబ్‌పేట మం డలం గురుకుంట సాయిబాబ ఆలయంలో శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి ఎంపీ ప్రత్యే క పూజలు చేశారు. ఈ సందర్భంగా మొదటి నామినేషన్ సెట్ పత్రాలకు అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అధికారం చేపట్టిన తక్కువ కాలంలోనే వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇస్తామన్న ఏ ఒక్క పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని కేవలం బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి మహిళల మధ్య గొడవలు సృ ష్టించిందన్నారు. బీజేపీ నాయకులు మతం పేర, ఆలయాల పేర ఓట్లు అభ్యర్థించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ పదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షే మ పథకాలే తమ ప్రచార అస్ర్తాలని స్పష్టం చేశారు. రెండోసారి తనకు అవకాశమిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, నాయకులు ప్రతాప్, కృష్ణారెడ్డి, రవి, జంగయ్య, హన్మంతు ఉన్నారు.
హన్వాడ, ఏప్రిల్ 19 : సింగిల్‌విండో మాజీ చైర్మన్, ప్రస్తుత సింగిల్‌విండో డైరెక్టర్ శ్రీనివాసులు శుక్రవారం హన్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఆ పార్టీలో చేరానని, అందులో గ్రూపు రాజకీయాలను భరించలేక బీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొండ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ నాగన్న, మార్కెట్‌కమిటీ మాజీ డైరెక్టర్ జంబులయ్య ఉన్నారు.