Ashwini Vaishnaw | పిల్లల సోషల్ మీడియా వాడకంపై మరిన్ని ఆంక్షలు.. త్వరలో అమలుచేస్తామన్న ఐటీ మంత్రి
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. వారికి సోషల్ మీడియా వాడకం మరింత సురక్షితంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై అశ్విని వైష్ణవ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. యువత ఎస్ఎం వాడకం విషయంలో మరింత నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘వయసు ఆధారంగా యూజర్లపై ఆంక్షలు విధించే అంశంపై సోషల్ మీడియా సంస్థలతో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తోంది. ఈ విషయంలో ఏది సరైంతో ఆలోచిస్తున్నాం. డీప్ ఫేక్ వంటి కొత్త టెక్నాలజీలు యువత సహా వినియోగదారులకు ప్రమాదకరంగా మారాయి. వినియోగదారుల్ని, సమాజాన్ని సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి రక్షించేలా చూడాలి. ఎస్ఎం సంస్థలు భారతీయ చట్టాలు, రాజ్యాంగ విలువల్ని పాటించాలి. ఎస్ఎం విషయంలో దేశంలో ఉన్న ప్రస్తుత చట్టాలు సరిపోవు. చట్టాల్ని మరింత కఠినతరం చేయాలి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిన నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, మెటా, ఎక్స్ వంటి సంస్థలు దేశ చట్టాల్ని అనుసరించాలి. ఇప్పటికే డీపీడీపీ యాక్ట్ వంటి చట్టాలు రూపొందించాం. పిల్లలు, యువతకు ఎస్ఎం వాడకం నియంత్రించే విషయంలో పార్లమెంట్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. సమాజానికి రక్షణ కల్పించే రూల్స్ తేవాలి’’ అని అశ్విని వైష్ణవ్ అన్నారు.
సోషల్ మీడియా వినియోగం యువతను పక్కదోవపట్టిస్తోందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందులోనూ 18 ఏళ్లలోపు పిల్లలు, యువత వీటిని వాడే విషయంలో నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు, నిపుణులు కోరుతున్నారు. ఈ దిశగానే ప్రభుత్వం చట్టాల్ని మరింత కఠినంగా మార్చబోతున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

